టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bhola Shankar) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా 1500 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్య(waltair veerayya) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న భోలా శంకర్ ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే… కోల్కతాలో తన సిస్టర్ తో కలిసి వెళ్ళిన హీరో అక్కడ టాక్సీ నడుపుతూ ఉండగా ఆ వుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ ని హీరో పోలిసుల హెల్ప్ తో పట్టిస్తాడు… ఈ క్రమంలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ముందుగా భోలా శంకర్ చూసే ముందు ఇది ఫక్తు కమర్షియల్ మూవీ అని గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వస్తే… మెగాస్టార్ మాస్ మూమెంట్స్, కొన్ని గూస్ బంప్స్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ ఇలా అన్నీ మరీ అద్బుతంగా కాక పోయినా పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంటాయి…. ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి…
ఇక ఒరిజినల్ చూసిన ఆడియన్స్ కి ఈ సినిమా చూస్తె చాలా సీన్స్ లో ఒరిజినల్ సీన్ గుర్తుకు వచ్చి కంపారిజన్ ల వలన సినిమా నచ్చే అవకాశం తక్కువ… ఇక చూడని ఆడియన్స్ అయితే చాలా రొటీన్ స్టోరీ పాయింట్ తో వచ్చిన భోలా శంకర్ ముందే చెప్పినట్లు ఫక్తు కమర్షియల్ మూవీ అని గుర్తు పెట్టుకుని వెళితే సీన్ వైజ్ గా ఎంజాయ్ చేయోచ్చు కానీ…
కథ పరమ రొటీన్ గా ఉండటం, తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది ఇట్టే చెప్పే విధంగా ఉండటంతో ఎక్కడా కూడా త్రిల్ ఫీల్ అయ్యేలా సీన్స్ పడలేదు అనిపిస్తుంది. మెగాస్టార్ లుక్స్ పరంగా రీ ఎంట్రీ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్స్ తో మెప్పించాడు, యాక్షన్ సీన్స్ కుమ్మేశాడు. హీరోయిజం సీన్స్ తో మెప్పించాడు…
ఇక కీర్తిసురేష్ ఉన్న రోల్ లో ఆకట్టుకోగా తమన్నా రోల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మిగిలిన యాక్టర్స్ అందరూ తమ రోల్స్ వరకు ఓకే అనిపించుకున్నారు. పాటలు పర్వాలేదు అనిపించగా కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గానే ఉండగా కొంత లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది…
ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే మెప్పించగా డైరెక్షన్ పరంగా మెహర్ రమేష్ ఎంచుకున్న స్టోరీనే పరమ రొటీన్ కాగా ఒరిజినల్ లో గూస్ బంప్స్ తెప్పించే కొన్ని సీన్స్ ని మార్చి ఇక్కడ ఆర్టిఫీశియల్ గా తెరకెక్కించాడు.. ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఇది ఈజీగా తెలిసిపోతుంది… అలాగే కామెడీ పేరుతో కొన్ని క్రింజ్ సీన్స్ ని పెట్టడం ఫ్యాన్స్ కి నచ్చవచ్చు కానీ జనరల్ ఆడియన్స్ కి అది ఇబ్బంది పెట్టేలా ఉంది..
ఓవరాల్ గా సినిమాలో మెగాస్టార్ పెర్ఫార్మెన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొన్ని యాక్షన్ సీన్స్ ప్లస్ పాయింట్స్ అయితే, వీక్ స్టోరీ, వీక్ డైరెక్షన్, ఫ్లాట్ నరేషన్ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్… ముందే చెప్పినట్లు ఇది ఫక్తు కమర్షియల్ మూవీ అని ప్రిపేర్ అయ్యి వెళితే సీన్స్ రొటీన్ గానే అనిపించిన ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు…
ఒరిజినల్ చూసిన వాళ్ళకి భోలా శంకర్ జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది, చూడని వాళ్ళకి పర్వాలేదు అనిపించేలా ఉంటుంది, కానీ ఓవరాల్ గా మెగాస్టార్ కోసం కొంచం ఓపిక చేసుకుని కూర్చుకుంటే కొన్ని పార్టు పార్టులుగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…