బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ ఇయర్ స్టార్టింగ్ లో వాల్తేరు వీరయ్య(Waltair veerayya) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు అల్టిమేట్ హిట్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు త్వరలో భోలా శంకర్(Bhola Shankar) తో….
సందడి చేయడానికి సిద్దం అవుతూ ఉండగా సినిమా మీద వాల్తేరు వీరయ్య కి ముందు ఉన్న రేంజ్ అంచనాల కన్నా కూడా కొంచం లో బజ్ ఉందని చెప్పాలి ఇప్పుడు. గాడ్ ఫాదర్ కన్నా బెటర్ ట్రెండ్ అండ్ వాల్తేరు వీరయ్య కన్నా లో బజ్ ఉంది ప్రస్తుతానికి…
ఒక్క సారి రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే ఆటోమాటిక్ గా ఇండిపెండెన్స్ వీకెండ్ లో దుమ్ము లేపే అవకాశం ఉన్నప్పటికీ ఇది సంక్రాంతి రేంజ్ వీకెండ్ అయితే కాదు… అసలే కొంచం లో బజ్ ఉన్న సినిమాకి నార్మల్ బిజినెస్ నే మేకర్స్ చేశారు…
ఇక సినిమా నార్మల్ టికెట్ రేట్స్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతుందని అనుకున్నా కూడా ఇప్పుడు సడెన్ గా ట్విస్ట్ ఇస్తూ టికెట్ హైక్స్ కోసం ఆంధ్రలో అప్లై చేశారు. నైజాంలో మల్టీ ప్లెక్సులలో ఆల్ రెడీ 295 టికెట్ రేట్ తో బుకింగ్స్ ఓపెన్ చేయగా… సింగిల్ స్క్రీన్స్ లో 175 వరకు టికెట్ రేటు పెట్టారు…
ఇక ఆంధ్రలో టికెట్ హైక్స్ కి అప్లై చేయడంతో బుకింగ్స్ ని ఇంకా ఓపెన్ చేయలేదు…ఒక్క సారి పర్మీషన్ వస్తే ఆంధ్రలో 200 నుండి 250 వరకు టికెట్ రేటు పెట్టే అవకాశం ఉంది… అసలు ప్రస్తుతానికి బజ్ కొంచం తక్కువగా ఉంది. ఇలాంటి టైం లో టికెట్ హైక్స్ సినిమా కి ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో అనేది చూడాలి ఇక…