Home గాసిప్స్ 80 కోట్ల సినిమా…అప్పుడు 110 కోట్ల రేటు…ఇప్పుడు రేటు భారీగా తగ్గించారు!

80 కోట్ల సినిమా…అప్పుడు 110 కోట్ల రేటు…ఇప్పుడు రేటు భారీగా తగ్గించారు!

0

బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి పాండమిక్ మొదలు కాక ముందు నుండి ఇప్పటి వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో అజయ్ దేవగన్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ మొదట్లో అజయ్ దేవగన్ నటించిన తానాజీ ది అన్ సంగ్ వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఏకంగా…

280 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఈ సినిమా తర్వాత రెండు నెలలకే పాండమిక్ రావడం తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోవడం బాలీవుడ్ సెకెండ్ వేవ్ తర్వాత కూడా కోలుకోలేక పోతుండటం జరిగింది. ఇక అజయ్ దేవగన్ ఈ సినిమా తర్వాత నటించిన సినిమా…

భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా… రియల్ ఇంసిడెంట్ ల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ను లాస్ట్ ఇయరే డిజిటల్ రిలీజ్ చేయాలనీ ట్రై చేశారు కానీ ఎందుకనో డిలే అవుతూ అవుతూ ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ను డిస్నీ ప్లస్ లో త్వరలో కన్ఫాం చేసుకుంది.

సినిమా ను మొత్తం మీద 80 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా లాస్ట్ ఇయర్ డిజిటల్ రిలీజ్ టైం లో ఈ సినిమా కోసం 110 కోట్ల రేటు ని పెట్టడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ముందుకు వచ్చింది. డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయింది అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ ను కంప్లీట్ గా డిలే చేస్తూ రావడం తో సినిమా పై బజ్ తగ్గిపోయింది.

రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసినా పెద్దగా బజ్ ఏమి క్రియేట్ కాలేదని తెలుస్తుంది ఇప్పుడు సినిమా బిజినెస్ చూస్తుంటే. 110 కోట్ల రేటు నుండి ఇప్పుడు సినిమా కి మొత్తం మీద 90 కోట్ల రేటు కి డీల్ ని క్లోజ్ చేసినట్లు బాలీవుడ్ లో చెబుతున్నారు. ఒకవేళ విపరీతంగా వ్యూస్ పెరిగితే అప్పుడు మరింత అమౌంట్ ఇస్తామని లేదంటే ఇదే ఫైనల్ అని డీల్ ని క్లోజ్ చేశారని అంటున్నారు. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here