Home న్యూస్ బింబిసార @ 975….మాస్ జాతర ఖాయం!!

బింబిసార @ 975….మాస్ జాతర ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైతలాజికల్ ఫాంటసీ మూవీ బింబిసార వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై ట్రేడ్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లా కాకుండా రేర్ గా తీసే మైతలాజికల్ కాన్సెప్ట్ ను ఎంచుకుని మినీ బాహుబలిని తలపిస్తూ మెప్పించిన బింబిసార ట్రైలర్ తోనే…

మెప్పించగా సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక బడ్జెట్ ఎక్కువ అయినా నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేటు సొంతం అవ్వడంతో థియేట్రికల్ బిజినెస్ చాలా రీజనబుల్ గా జరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ మాత్రం సాలిడ్ గానే ఉంది.

ఒకసారి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 232
👉Ceeded – 130
👉Andhra – 320
AP TG: 685~
👉Ka+ROI – 80~
👉Os – 210+
Total WW: 975+

ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క. మొత్తం మీద రిలీజ్ రోజు టైం కి వరల్డ్ వైడ్ గా 1000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here