అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ 3rd వేవ్ లాంటిది లేకుండా ఉండి ఉంటే ఈ పాటికే పాన్ ఇండియా మూవీస్ సందడి సంక్రాంతి తర్వాత కూడా కొనసాగేది… ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవ్వాల్సిన క్రేజీ సినిమాల అప్ డేట్స్ తో మ్రోత మ్రోగిపోయేది, కానీ అన్నీ పోస్ట్ పోన్ అవ్వడంతో ఫిబ్రవరి సినిమాలలో కొన్ని సినిమాలు ఆల్ రెడీ రిలీజ్ లను పోస్ట్ పోన్ చేశాయి. వాటిలో చాలా టైం గా…
పెండింగ్ లో ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఒకటి, సంక్రాంతి సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది అనుకున్నా అలా జరగలేదు, పోనీ ఫిబ్రవరి 4నే వస్తుంది అనుకున్నా అలా కూడా జరగలేదు. సినిమా ఇప్పుడు ఏప్రిల్ 1 న రిలీజ్ అని…
అనౌన్స్ చేశారు కానీ అప్పటికీ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయితేనే ఈ సినిమా వస్తుందని లేటెస్ట్ టాక్, ఆర్ ఆర్ ఆర్ ఏప్రిల్ ఎండ్ కి వస్తే ఈ సినిమా తర్వాత రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా వదిలేసిన డేట్ ఫిబ్రవరి 4 పై కొన్ని సినిమాల దృష్టి పడింది కానీ….
ఎవ్వరూ రిస్క్ చేయడానికి పెద్దగా సిద్ధం లేనట్టే కనిపిస్తూ ఉండగా ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మైతలాజికల్ మూవీ బింబిసారని ఆ డేట్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో గట్టిగా వార్తలు చెక్కర్లు కొడుతూ ఉన్నాయి… ఆల్ మోస్ట్ ఇంకో 2 వారాల వరకు టైం ఉండటంతో ఇప్పటి నుండి ప్రమోషన్స్ చేసి…సినిమాను ఆ డేట్ కి వదలాలి అని ప్లాన్ చేస్తున్నారట.
ఏకంగా 45 కోట్ల భారీ బడ్జెట్ తో, భారీ సెట్టింగ్ లు గ్రాండియర్ గా ఉండబోతున్న ఈ మైతలాజికల్ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి అప్పటికి పరిస్థితులు కనుక బాగుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో మంచి వసూళ్ళతో ఫిబ్రవరిలో దుమ్ము లేపడానికి అవకాశం ఎంతైనా ఉంది కానీ అదే టైంలో రిస్క్ కూడా ఉంది. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.