బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 2022 టాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడమే కాదు ఈ ఇయర్ లోనే ది బెస్ట్ మంత్ గా కూడా నిలిచింది, మధ్యలో మాచర్ల అండ్ లైగర్ లు కంప్లీట్ గా ఎదురుదెబ్బ కొట్టినా కానీ బింబిసార, సీతా రామం మరియు కార్తికేయ2 సినిమా లు ఒక్క వారం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి ఒకటికి మించి ఒకటి ఆడియన్స్ మనసు గెలుచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…
సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగించగా మొత్తం మీద ఈ మూడు సినిమాలు కూడా యిప్పుడు ఓ అద్బుతమైన రేర్ ఫీట్ ను సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్ లో వచ్చిన మీడియం రేంజ్ మూవీస్ పరంగా…
బిజినెస్ మీద అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భారీ లాభాలను దక్కించు కున్న సినిమాల్లో ఒకటి తర్వాత ఒకటి చోటు దక్కించుకోగా వీటిలో ఇప్పుడు కార్తికేయ2 సినిమా అత్యంత భారీ లాభాలను అందుకుని ఏకంగా టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక సీతా రామం సినిమా లిస్టులో లేట్ గా ఎంటర్ అయినా కానీ…
ఇప్పుడు సాలిడ్ ప్రాఫిట్స్ ని వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో అందుకుని బింబిసార కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ను దక్కించుకుంది. ఒకసారి ఆగస్టు 29 వరకు ఈ మూడు సినిమాల టోటల్ ప్రాఫిట్ లెక్క టాప్ లిస్టులో ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
👉#GeethaGovindam- 55.43C(15CR Business)
👉#Karthikeya2- 35.98C(12.8C)**
👉#Uppena- 31.02Cr(20.5C)
👉#Fidaa- 30.5C(18C)
👉#JathiRatnalu- 27.52C(11C)
👉#iSmartShankar- 22.78C(17.7C)
👉#SitaRamam- 22.01C(16.2C)**
👉#Bimbisara- 21.65C(15.6C)**
👉#ArjunReddy- 20.3C(5.5Cr)
మొత్తం మీద చూసుకుంటే కార్తికేయ2 సినిమా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉండగా సీతా రామం కూడా మరింత లాభాన్ని అందుకోవచ్చు. బింబిసార థియేటర్స్ చాలా వరకు తగ్గినా ఇప్పటికే ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను అందుకుంది. ఈ మూడు సినిమాలు ఒకవారం గ్యాప్ లో రిలీజ్ అయ్యి ఇలా హైయెస్ట్ ప్రాఫిట్స్ తో సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి.