Home న్యూస్ బ్లాక్ పాంథర్-వకాండ ఫరేవర్ రివ్యూ….బాగుంది సినిమా!!

బ్లాక్ పాంథర్-వకాండ ఫరేవర్ రివ్యూ….బాగుంది సినిమా!!

0

మార్వేల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లేటెస్ట్ మూవీ బ్లాక్ పాంథర్-వకాండ ఫరేవర్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది… బ్లాక్ పాంథర్ గా నటించిన ఖాడ్ విక్ బోస్మెన్ సడెన్ డెత్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు రేకేత్తగా సినిమాలో బ్లాక్ పాంథర్ గా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తిగా మారగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉందని చెప్పాలి.

సినిమా స్టార్ట్ అవ్వడం కింగ్ ట చాలా అంతుపట్టని వ్యాధితో మరణానికి దగ్గరగా ఉండటంతో తన చెల్లి తనని కాపాడటానికి కష్టపడినా తను మరణించాడు అన్న వార్తాతో సినిమా మొదలు అవ్వగా తర్వాత వకాండలో ఉన్న వైబ్రేనియం కోసం కొన్ని దేశాలు ఎలాగైనా దక్కించుకోవాలని చేసే…

ప్రయత్నంలో మరో వింత తెగ గురించి తెలుస్తుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం భూమి నుండి సముద్రంలో బ్రతికే ఈ తెగలో మరణం అంటే తెలియని ఓ బాబు పుతడతాడు, అతను భూమి మీద సముద్రంలో బ్రతకగల శక్తితో పాదాలకు రెక్కలు కలిగి పుట్టడంతో తనని దేవునిలా చూస్తారు….

తన రాజ్యంలో కూడా వైబ్రేనియం ఉండటం, వాటి కోసం వెతికే వాళ్ళని అంతమొందించే ఈ రాజు దీనికంతంటికీ కారణం వకాండ వాసులే అని వాళ్ళ మీద అనుకోని పరిస్థితుల వలన గొడవకి దిగుతాడు, రాజు లేని వకాండని ఎవరు ఆదుకోవడానికి వచ్చారు, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ ఆల్ మోస్ట్ చెప్పినా సినిమా చూస్తున్నప్పుడు ఇవేవి గుర్తుకు రాకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం.

ఫస్టాఫ్ అద్బుతంగా మెప్పించిన తర్వాత సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినట్లు అనిపించినా ఓవరాల్ గా విజువల్స్ గ్రాండియర్ గా ఉండటం, అద్బుతమైన సీన్స్ తో మెప్పించే బ్లాక్ పాంథర్-వకాండ ఫరేవర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఖాడ్ విక్ బోస్మెన్ కి ఘన నివాళిలా నిలుస్తుంది, మర్వెల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉన్న ఈ సినిమా కామన్ ఆడియన్స్ కి కొంచం అక్కడక్కడా బోర్ అనిపించినా కానీ ఓ మంచి సినిమా చూశాం అనిపించడం ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here