యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో ట్రేడ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో బజ్ ఉన్నప్పటికీ కూడా మూడు రోజుల ముందే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఓవరాల్ బుకింగ్స్ యావరేజ్ అనిపించే విధంగానే ఉన్నాయి. గోపీచంద్ సీటిమార్ కి కూడా బుకింగ్స్ నాసిరకంగానే ఉన్నప్పటికీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కౌంటర్స్ దగ్గర బాగా జరగడంతో ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 955 కి పైగా థియేటర్స్ లో…
సుమారు 16 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న పక్కా కమర్షియల్ మూవీ ఇప్పుడు మొత్తం మీద మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతుంది. టాక్ పాజిటివ్ గా ఉంటె షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉంది.
మొత్తం మీద సీటిమార్ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి కానీ మొత్తం మీద సినిమా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ లో కౌంటర్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా కి వచ్చే ఓవరాల్ టాక్ ని బట్టి…
ఈ కలెక్షన్స్ ఎంతవరకు ముందుకు వెళతాయో చూడాలి. మొత్తం మీద టాక్ సూపర్ పాజిటివ్ గా ఉండి సినిమా సీటిమార్ కన్నా బెటర్ ఓపెనింగ్స్ ని ఇప్పుడు సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ రూపంలో ఎలాంటి కలెక్షన్స్ తో ఓపెన్ అవుతుందో చూడాలి…..