రజినీ “దర్బార్” టోటల్ థియేటర్స్…బుకింగ్స్ రిపోర్ట్స్!!

     సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ కన్ఫాం అయింది, సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాల కన్నా ముందు వస్తున్న నేపధ్యంలో భారీ ఎత్తున థియేటర్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.

సినిమా కి నైజాం ఏరియాలో మొదటి రోజు ఏకంగా 250 నుండి 260 వరకు థియేటర్స్ దొరుకుతున్నాయట. ఇక సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 140 కి పైగా థియేటర్స్ లో దర్బార్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఆంధ్రా రీజన్ కి గాను సినిమా… సుమారుగా 350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 750 కి పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది. ఇక తమిళ్ వర్షన్ హిందీ వర్షన్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 3000 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 2 రోజుల ముందు నుండే మొదలు అవ్వగా…

మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా క్లాస్ సెంటర్స్ లో ఓకే అనిపించే విధంగా సాగుతుంది, మొత్తం మీద బుకింగ్స్ ఇప్పటి వరకు ఓవరాల్ గా 25% వరకు జరిగింది, మొదటి షో సమయానికి ఓవరాల్ గా 35% నుండి 40% వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. తర్వాత టాక్ ని బట్టి స్టేటస్ మరింత పెరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పాలి. తర్వాత మొదటి షో టాక్ ని బట్టి లెక్క 4 కోట్లు టచ్ చేసే చాన్స్ కూడా ఉంది, లాస్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ పేట ఫస్ట్ డే 1.65 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది, ఇప్పుడు మాత్రం బెటర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE