విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన లైగర్ మూవీ మొదటి రోజు నుండే అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ రాగా హిందీలో మాత్రం మంచి ఓపెనింగ్స్ ని అందుకుని డీసెంట్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. మూడో రోజు మాత్రం భారీగా డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా హోల్డ్ చేయలేక పోయిన సినిమా మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 40% రేంజ్ లో డ్రాప్ అయ్యి అటూ ఇటూ గా ఇప్పుడు…..
60 లక్షల లోపు లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం పెరిగే ఛాన్స్ ఉంది. ఇక హిందీలో ఈ రోజు సినిమా మ్యాచ్ వలన కొద్ది వరకు ఎఫెక్ట్ అయినా కానీ మొత్తం మీద 3.75 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజు 3 కోట్ల నుండి 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు కానీ సినిమా అందుకోవాల్సిన…
90 కోట్ల కొండంత టార్గెట్ కి గాను సినిమా సాధించే ఈ కలెక్షన్స్ అసలు టార్గెట్ లో సగం టార్గెట్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళే అవకాశం లేదనే చెప్పాలి. దాంతో ఈ ఇయర్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ లాస్ ను సొంతం చేసుకునే సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ముందు నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.