Home గాసిప్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న బోయపాటి….ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!!

ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న బోయపాటి….ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!!

0

     బోయపాటి శ్రీను… టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ లో ఒకరు, మాస్ జనాల్లో సాలిడ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న డైరెక్టర్… భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలతో మాస్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్… బాలయ్య తో సినిమా అంటే చాలు ఓ రేంజ్ లో రెచ్చిపోతాడు… వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న బాలయ్య కి సింహా తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ దక్కేలా చేసిన బోయపాటి తర్వాత లెజెండ్ తో మరోసారి కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చి దుమ్ము లేపాడు, ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి మీడియా తో చిట్ చాట్ చేశారు బోయపాటి.

కాగా ఈ సందర్భంగా సినిమా గురించి చెబుతూ ఇందులో బాలయ్య అఘోరా పాత్ర చేస్తున్నారా అని అడగ్గా… వారణాసి లో భారీ షెడ్యూల్ చేశాం. అందువలన ఆ వార్తా స్ప్రెడ్ అయింది అంటూ ఆ పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పారు, మొత్తం మీద అఘోరా పాత్ర చేయడం లేదు అని మాత్రం చెప్పలేదు…

ఇక సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తుందని, తమ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను మించే సినిమా ఉంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు బోయపాటి శ్రీను. దాంతో ఈ మాటలు విన్న ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం అని చెప్పాలి.

ఇక ఇటు బోయపాటి కానీ అటు బాలయ్య కానీ రీసెంట్ ఫామ్ అనుకున్న రేంజ్ లో లేదు, బోయపాటి సైరనోడు తర్వాత క్లీన్ హిట్ కొట్టలేదు, ఇటు బాలయ్య హాట్రిక్ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నాడు. ఇలాంటి టైం లో ఇద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వలాని చూస్తున్నారు.. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here