Home గాసిప్స్ ఆ సెన్సేషనల్ రోల్ పై బోయపాటి షాకింగ్ కామెంట్స్!!

ఆ సెన్సేషనల్ రోల్ పై బోయపాటి షాకింగ్ కామెంట్స్!!

308
0

     నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అదుర్స్ అనే చెప్పాలి. వీళ్ళ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన సింహా కానీ లెజెండ్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అది కూడా బాలయ్య కెరీర్ లో వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకుంటున్న టైం లో ఈ సినిమా రావడం బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం జరిగింది.

సింహా మరియు లెజెండ్ సెన్సేషనల్ హిట్స్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు మూడో సినిమా భారీ ఎత్తున రూపొందుతుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా లాక్ డౌన్ రావడం తో అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా షూటింగ్ ఆగిపోయింది.

ఇక లాక్ డౌన్ లో సినిమాల గురించి ఇంటర్వ్యు లు చేస్తుండటం తో బోయపాటి శ్రీను కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో భాగంగా ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న అఘోరా రోల్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ వారణాసి లో భారీ షెడ్యూల్ జరిపామని…

అక్కడ అఘోరా గెటప్ లో బాలయ్య పై షూట్ కంప్లీట్ చేశామని బోయపాటి చెప్పాడు, అఫీషియల్ గా బాలయ్య అఘోరా రోల్ లో కనిపిస్తారని ఓపెన్ చేయడం తో అంచనాలు భారీ గా పెరిగాయని చెప్పొచ్చు. మా కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన 2 సినిమాల కన్నా కూడా పవర్ ఫుల్ రోల్ అవసరమని… డానికి కొంచం కొత్తదనం కూడా కావాలి కాబట్టి…

ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ఈ రోల్ సిద్దం చేసి బాలయ్య కి చెప్పగా బాలయ్య ఆ రోల్ లో దుమ్ము దులిపేశాడని అంటున్నాడు బోయపాటి… ఇక మరో రోల్ లో పొలిటికల్ లీడర్ గా కూడా కనిపిస్తాడట బాలయ్య. ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకుని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here