బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్ ఆలియా భట్ ల కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా బాలీవుడ్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు. వీకెండ్ లోనే టోటల్ గా 225 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు 4వ రోజు….
వర్కింగ్ డే టెస్ట్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా కి రికార్డ్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ లభించాయి అని చెప్పాలి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ తో….
కానీ సినిమా సాధించిన ఈ రికార్డ్ కలెక్షన్స్ ఓవరాల్ గా హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. బాలీవుడ్ లో కొందరు ఈ సినిమాను ఎలాగైనా హిట్ అవుతుంది అని చెప్పడానికి 250 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తే హిట్ అవుతుంది అంటూ చెబుతున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు…
సినిమా కి నాన్ థియేట్రికల్ అండ్ ఓవర్సీస్ బిజినెస్ కలిపి బడ్జెట్ లో సగం రికవరీనే జరగగా సినిమా టోటల్ గా 400 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాలి, అలా కాదు ఓవరాల్ బడ్జెట్ లెక్కలకు తగ్గట్లు కలెక్షన్స్ రావాలి అంటే 650 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది…
అప్పుడే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది అన్న మాట… ఈ కలెక్షన్స్ ని అందుకోవడం అంటే ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ జోరు ను లాంగ్ రన్ లో ఇదే విధంగా కొనసాగిస్తేనే సాధ్యం అని చెప్పాలి. మరి సినిమా లాంగ్ రన్ లో ఈ కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక…