పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరం తేజ్ కలిసి నటిస్తుండగా ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగు వర్షన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా రీమేక్ అని తెలిసి ఒరిజినల్ ని చూసిన ఆడియన్స్ ఈ క్లాస్ మూవీ పవన్ కళ్యాణ్ కి ఎలా సెట్ అవుతుందో అని భయపడుతూ ఉండగా…
సినిమా జులై ఎండ్ లో రిలీజ్ కానుండగా సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. “బ్రో” అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయే విధంగా ఉండగా పవన్ కళ్యాణ్ లుక్ కానీ…
మాస్ స్వాగ్ కానీ ఒక్కసారిగా సినిమా పై అంచనాలను అమాంతం పెరిగేలా చేశాయి… ఇది చూసిన ఆడియన్స్… ఒరిజినల్ వర్షన్ చాలా క్లాస్…ఇక్కడ ఫస్ట్ లుక్ తో ఇలా అంచనాలు పెంచేస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ది ఎక్స్ టెండెడ్ క్యామియో… ఇలా అంచనాలు ఓ రేంజ్ లో పెంచేస్తే ఇక బాక్స్ ఆఫీస్ జాతరే అంటూ అనుకుంటున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.