బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) లు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(Bro The Avatar) ఆడియన్స్ ముందుకు ఈ నెల చివర్లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద పర్వాలేదు అనిపించేలా…
ట్రేడ్ లో ఆడియన్స్ లో బజ్ అయితే ఉందని చెప్పాలి. పవన్ ది జస్ట్ ఎక్స్ టెండెడ్ క్యామియోనే అవ్వడంతో మరీ భీమ్లా నాయక్ రేంజ్ లో హైప్ ఈ సినిమా రాలేదు. కానీ మంచి క్లాస్ అండ్ ఫీల్ గుడ్ మూవీ అవ్వడంతో టాక్ బాగుంటే లాంగ్ రన్ ఉండే అవకాశం ఉండటంతో…
ఈ సినిమాకి కూడా భారీ రేట్లనే మేకర్స్ అన్ని ఏరియాలలో కోట్ చేస్తూ ఉండగా ఆంధ్ర సీడెడ్ కొన్ని ఏరియాల్లో ఆల్ రెడీ హైర్స్, MGలు, SG లు లాంటివి కట్టడం స్టార్ట్ చేశారు బయర్స్…. కానీ రీసెంట్ గా పవన్ పొలిటికల్ టూర్ లో చేసిన కామెంట్స్ వలన…
ఇప్పుడు సినిమా బిజినెస్ మీద ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది, హైర్స్, MGలు, SG లు లాంటివి కట్టిన బయ్యర్లు ఇప్పుడు ఆ అమౌంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నారట…. సినిమా రిలీజ్ టైంలో వకీల్ సాబ్(Vakeel Saab) కి, భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమా కి…
ఎదురు అయినట్లు సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో ఎదురు అయ్యే అవకాశం ఉండటంతో భారీ రిస్క్ లు ఏమి చేయడం లేదని సమాచారం. దాంతో హైర్స్, MGలు, SG లు లాంటివి లేకుండాఅనే బ్రో మూవీ(BRO Movie) ఇప్పుడు రిలీజ్ కాబోతుందట. ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ వచ్చేలా చేస్తుందో చూడాలి ఇప్పుడు.