టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్ ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) ఆడియన్స్ ముందుకు ఈ మధ్యనే రిలీజ్ అవ్వగా మంచి స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా కూడా…
సినిమా కలెక్షన్స్ పరంగా వర్కింగ్ డేస్ లో అండర్ పెర్ఫార్మ్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా రిలీజ్ కి ముందే మంచి బిజినెస్ ను సొంతం చేసుకోగా…
థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 97.50 కోట్ల దాకా ఉండగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓవరాల్ గా ఎంతవరకు పలికింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొత్తం మీద నాన్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 50 కోట్ల రేంజ్ దాకా పలికిందని అంటున్నారు ఇండస్ట్రీలో…
అందులోనే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ తో పాటు డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి 50 కోట్ల రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ను బ్రో ది అవతార్ మూవీ సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ ఉండగా మేకర్స్ కి ఈ సినిమా ద్వారా…
మంచి టేబుల్ ప్రాఫిట్ సొంతం అయ్యిందని అంటున్నారు…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ సూపర్ స్టడీగా సొంతం చేసుకుని వీకెండ్ లో ఊహకందని గ్రోత్ ని చూపిస్తేనే బ్రేక్ ఈవెన్ కి అవకాశాలు కొద్దివరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు… మరి ఏం జరుగుతుందో చూడాలి.