బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీస్ టాక్ ఎలా ఉన్నా కానీ వీకెండ్ వరకు కలెక్షన్స్ పరంగా వీర విహారం చేస్తాయి. కానీ లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేక పోయినా కానీ…
కేవలం పవర్ స్టార్ క్రేజ్ పవర్ వలనే వీకెండ్ వరకు మరీ గ్రోత్ ని చూపించకపోయినా కూడా డీసెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగించినా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా పరిస్థితి టోటల్ గా మారిపోయింది…. 20 కోట్ల రేంజ్ వర్త్ షేర్ తో ఓపెన్ అయిన సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కోటి రేంజ్ షేర్ మార్క్ ని అందుకోవడానికి 6 రోజుల టైం మాత్రమే పట్టింది అంటే ఏ రేంజ్ లో సినిమా డ్రాప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా కొంచం మిక్సుడ్ టాక్ వచ్చినా ఉన్నంతలో ఆడియన్స్ ను అలరించే అంశాలు సినిమాలో ఉన్నా కూడా….
ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రావడం లేదు, న్యూట్రల్ ఆడియన్స్ కాలేజ్ యూత్ బేబి మూవీకే మొగ్గు చూపుతూ ఉండటంతో బ్రో మూవీ కి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం చాలా చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది.
ఏ సినిమా అయినా కూడా వర్కింగ్ డేస్ లో డ్రాప్ అవ్వడం కామన్, కానీ బ్రో మూవీ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్ అవుతూ ఉండటం ఇక్కడ అందరినీ శాకయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.
సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 36 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా రెండో వీకెండ్ లో ఆల్ మోస్ట్ మొదటి వీకెండ్ లెవల్ లో హోల్డ్ ని చూపిస్తే తప్పితే తేరుకునే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు. మరి సినిమా ఎలా వచ్చే వీకెండ్ వరకు కలెక్షన్స్ పరంగా హోల్డ్ చేస్తుందో చూడాలి.