బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల ఎండ్ లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయి ధరం తేజ్ ( Sai Dharam Tej ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో ది మూవీ(BRO The Avatar) సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి…
కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ ది కేవలం స్పెషల్ గెస్ట్ రోల్ అవ్వడంతో మేకర్స్ చెబుతున్న భారీ రేట్లని బయ్యర్స్ ఒప్పుకోవడం లేదు… అన్ని ఏరియాలలో కూడా సినిమా బిజినెస్ కోట్స్ భారీగా మేకర్స్ చెబుతూ ఉండటం ప్రస్తుత పరిస్థితులు అలాగే…
పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ చెబుతున్న భారీ రేట్స్ కాకుండా సేఫ్ జోన్ లో రేట్స్ ని చెబుతూ ఉన్నారు… కాగా నైజాం ఏరియా విషయానికి వస్తే సినిమా మేకర్స్ 36 కోట్ల రేంజ్ లో రేటుని మేకర్స్ కోట్ చేయగా…
దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఆ రేంజ్ రేటు ఇవ్వడానికి ఒప్పుకోలేదని ట్రేడ్ లో సమాచారం. దిల్ రాజు మొత్తం మీద 26 నుండి 27 కోట్ల రేంజ్ లో రేటుని మేకర్స్ కి కోట్ చేయగా మేకర్స్ ఆ రేటుకి ఒప్పుకోలేదని సమాచారం….
మరి కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఏవి కూడా 30 కోట్లను మించిపోకపోవడంతో మేకర్స్ ఇక తగ్గడానికి సిద్ధం అవ్వగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 30 కోట్ల రేటుకి ఒప్పుకుని బ్రో మూవీ(BRO movie Business) రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ బిజినెస్ చాలా సేఫ్ బిజినెస్ అనే చెప్పాలి. ఇక టోటల్ అన్ని ఏరియాల బిజినెస్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.