పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) భారీ లెవల్ లో రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్ టైం అన్నీ సెట్ అయ్యి బజ్ ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి బజ్ ఉండగా సినిమా ఆ బజ్ కి తగ్గట్లు మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే… లైఫ్ లో వర్క్ కి తప్ప మిగిలిన వ్యక్తులకు టైం లేని సాయి ధరం తేజ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. అప్పుడు టైం గాడ్ అయిన పవన్ కళ్యాణ్ ని కలుసుకుంటాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక వరాన్ని ఇస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
పెర్ఫార్మెన్స్ పరంగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, ఇలా దేవుడు భక్తుడు లాంటి కాన్సెప్ట్ మూవీస్ లో దేవుడు కొన్ని సీన్స్ కే పరిమితం అవుతూ ఉంటాడు కానీ ఇక్కడ పవన్ ముందే చెప్పినట్లు దాదాపు 80% సీన్స్ లో కనిపిస్తాడు….తన స్టైల్, స్వాగ్, ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. సాయి ధరం తేజ్ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ అందరూ చిన్న చిన్న రోల్స్ లో ఓకే అనిపిస్తారు…
పాటల విషయంలో తమన్ నిరాశ పరచగా బ్రో థీమ్ సాంగ్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి… ఒక పాట అయితే అసలు ఎందుకు పెట్టార్రా బాబు అనిపించేలా అనిపిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పడుతూ లేస్తూ సాగగా ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో డ్రాగ్ అయింది… మెలో డ్రామా బాగానే ఉన్నా అవి కనెక్ట్ అయ్యే అవకాశం కొంచం తక్కువే…
సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ వీక్ గా ఉన్నాయి, VFX వర్క్ పూర్ గా ఉంది… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సముద్రఖని చెప్పిన కథ ఆల్ రెడీ అందరికీ పరిచయం ఉన్న కథనే…దానికి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్, సాంగ్స్ తో ఫ్యాన్స్ ని అయితే సాటిస్ ఫై చేయగలిగాడు కానీ… కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఫ్యూ ను అంతగా ఫుల్ సాటిస్ ఫై చేయలేదు కానీ బాగానే మెప్పించాడు….
స్టోరీ పాయింట్ తెలిసిందే అయినా చెప్పే విధానం ఒక స్టేజ్ వరకు బాగా మెప్పించినా అనవసరపు సన్నివేశాలు, వీక్ సాంగ్స్, ఓవర్ ది టాప్ అనిపించే కొన్ని సీన్స్ తో సినిమా డీసెంట్ తో గుడ్ అనిపించేలా వెళుతూనే తిరిగి డీసెంట్ దగ్గరకే వస్తుంది…క్లైమాక్స్ ఎమోషనల్ గా బాగున్నప్పటికీ మొత్తం మీద సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ సాటిస్ ఫై అయినట్లు అనిపించినా…
మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది కానీ ఫ్యాన్స్ కి సినిమా ఎక్కువగా నచ్చుతుంది…ఇక సినిమా ఒరిజినల్ వర్షన్ చూసిన ఆడియన్స్ చాలా మందే ఉంటారు కాబట్టి చాలా సీన్స్ లో వాళ్ళకి ఒరిజినల్ వర్షన్ గుర్తుకు వస్తుంది… దాంతో వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం తగ్గిపోగా… ఒరిజినల్ వర్షన్ చూడని ఆడియన్స్ కి మాత్రం బ్రో మూవీ ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు…
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, డైలాగ్స్ బాగుండటం, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించడం, ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ అలాగే క్లైమాక్స్ పార్ట్ లాంటివి ప్లస్ పాయింట్స్ అయితే, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ చేయడం, సాంగ్స్, VFX వర్క్, ఓవర్ ది టాప్ సీన్స్, ఎమోషన్స్ కనెక్ట్ కాక పోవడం లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్.
ఓవరాల్ గా బ్రో మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ప్రామిసింగ్ గా మారి ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంటూ ఇంటర్వెల్ వరకు బాగుంది అనిపించి సెకెండ్ ఆఫ్ కూడా అలానే స్టార్ట్ అయినా తిరిగి స్లో అయ్యి అలాగే సాగి మధ్య మధ్యలో ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్ తో ఓకే అనిపించి క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ మెప్పించడంతో ఓవరాల్ గా పర్వాలేదు బాగుంది అనిపించేలా ముగుస్తుంది….
ఫ్యాన్స్ కి సినిమా మొత్తం మీద చాలా వరకు సాటిస్ ఫై చేస్తుంది, కానీ మిగిలిన ఆడియన్స్ కి మాత్రం సినిమా కొంచం ఓపికతో చూస్తె సినిమా అయ్యే టైంకి ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్…