2023 లాస్ట్ లో 2 నోటబుల్ మూవీస్ ఆడియన్స్ ముందుకు రాగా అందులో యంగ్ అప్ కమింగ్ యాక్టర్ రోషన్ కనకాల హీరోగా లాంచ్ అయిన బబుల్ గమ్(Bubblegum Review in Telugu) మూవీ ఒకటి, ట్రైలర్ రిలీజ్ తర్వాత యూత్ ను అట్రాక్ట్ చేసేలా అనిపించిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
స్టోరీ పాయింట్ కి వస్తే రెండు డిఫెరెంట్ బ్యాగ్రౌండ్స్ కి చెందిన హీరో మరియు హీరోయిన్స్ పబ్ లో కలుసుకుంటారు, డిజే అయిన హీరోని చూసి హీరోయిన్ ఇష్టపడుతుంది, వీళ్ళ లైఫ్ సాఫీగా సాగుతూ ఉన్న టైంలో అనుకోకుండా జరిగిన ఒక గొడవ వలన హీరోయిన్ హీరోని అవమానిస్తుంది, ఆ తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
చాలా నార్మల్ స్టోరీ పాయింట్ తో వచ్చిన బబుల్ గమ్ మూవీలో మొదటి సినిమానే అయినా కూడా నటుడిగా బాగానే పెర్ఫార్మ్ చేశాడు రోషన్ కనకాల, తన యాక్టింగ్ బాగుండగా కొన్ని సీన్స్ లో పెర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ పర్వాలేదు అనిపించగా ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరింది, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు, సంగీతం పర్వాలేదు అనిపించగా ఇజ్జత్ సాంగ్ బాగుంది…
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ మినహా ఫ్లాట్ గా ఉండగా ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకెండ్ లో కొన్ని సీన్స్ కి బాగున్నా ఓవరాల్ గా నీరసంగా ఉంటుంది స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ బాగా మెప్పించగా డైరెక్షన్ విషయానికి వస్తే…
రవికాంత్ పేరేపు ఎంచుకున్న పాయింట్ చాలా సింపుల్ గా ఉండగా యూత్ ని అట్రాక్ట్ చేసే సీన్స్ బాగానే పెట్టినా అసలు కథలోనే అంతగా డెప్త్ కనిపించకపోవడంతో ఫ్లాట్ గా అనిపిస్తుంది, హీరోని బాగానే ప్రజెంట్ చేసినా కూడా కథ చాలా నత్తదకన సాగడం మేజర్ డ్రా బ్యాక్, ఓవరాల్ గా సినిమాలో హీరో హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే యూత్ కి నచ్చే కొన్ని సీన్స్…
తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ కొన్ని ప్లస్ పాయింట్స్ కాగా ఫ్లాట్ స్టోరీ, లాగ్ ఎక్కువగా అనిపించడం, రొటీన్ కథ మేజర్ డ్రా బ్యాక్స్. అయినా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా యూత్ ఆడియన్స్ కి సినిమా కొంచం బోర్ అనిపించినా కూడా ఉన్నంతలో ఒకసారి చూసేలా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…