యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే, లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన రిలీజ్ ను సొంతం చేసుకోలేక పోయింది కానీ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెబుతూ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు సమ్మర్ కానుకగా మిగిలిన సినిమాల కన్నా ముందు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమా కన్నా ముందు నితిన్ నటించిన…
ఎక్స్ పెరిమెంటల్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ ఈ సినిమా కి సాలిడ్ బిజినెస్ ఓవరాల్ గా దక్కడం విశేషం అనే చెప్పాలి, రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ టార్గెట్ తో…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతుంది, సినిమా నైజాం ఏరియాలో 7.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, సీడెడ్ ఏరియాలో 3.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక టోటల్ ఆంధ్రా రీజన్ లో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను…
సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 23.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు కర్ణాటక లో కలిపి 1.2 కోట్ల బిజినెస్ ను, ఓవర్సీస్ మొత్తం మీద 1.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, టోటల్ వరల్డ్ వైడ్ గా బిజినెస్ 23.9 కోట్ల మార్క్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర..
ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 24.5 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, టికెట్ హైక్స్ లాంటివి ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది కానీ టార్గెట్ మాత్రం చాలా పెద్దదే అని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక..