మలయాళంలో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సినిమా కప్పేలా సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన బుట్ట బొమ్మ సినిమా ఆడియన్స్ ముందుకు డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియన్స్ లో కొంత మంది ఒరిజినల్ వర్షన్ ని ఆల్ రెడీ చూసి ఉండగా చూడని వాళ్ళ కోసం ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన బుట్టబొమ్మ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…ముందుగా సినిమా స్టొరీ పాయింట్ కి వస్తే…
అరకులో ఉండే హీరోయిన్ తన ఫ్యామిలీతో కలిసి ఉండగా ఓ ఫోన్ కొనుక్కోవాలని కోరిక ఉంటుంది… ఇంతలో అనుకోకుండా ఓ రాంగ్ ఫోన్ కాల్ లో ఒక హీరోతో మాట్లాడుతుంది, ఇక ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుతూ హీరోని ప్రేమించే హీరోయిన్ ఒకరోజు తనని కలవడానికి వెళుతుంది, ఆ తర్వాత ఏమయింది…ఇంతకీ మరో హీరో అర్జున్ దాస్ రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
అనిక తన రోల్ లో క్యూట్ గా బాగానే నటించి మెప్పించగా, అర్జున్ దాస్ వశిష్ఠల రోల్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించగా సంగీతం సోల్ ఫుల్ గా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లో గా ఉంటుంది అని చెప్పాలి. ఓవరాల్ గా కథ చాలా చాలా నార్మల్ గా ఉంటుంది… ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే మరో ట్విస్ట్ ల చుట్టూ కథ సాగుతుంది… కానీ…
స్క్రీన్ ప్లే మలయాళ వర్షన్ లో ఉన్నట్లు చాలా స్లో గా ఉండటంతో ఇలాంటి స్లో నరేషన్ మూవీస్ నచ్చే ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించే అవకాశం ఉంటుంది, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టగా తర్వాత కథ స్లోగానే సాగుతూ ఇంటర్వెల్ ఆసక్తిగా సాగుతుంది, ఇక సెకెండ్ ఆఫ్ మళ్ళీ అక్కడక్కడా కొన్ని ఆసక్తి కలిగించే సీన్స్ వచ్చినప్పటికీ కథనం మాత్రం నెమ్మదిగానే సాగుతుంది… క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల వలన సినిమా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది…
ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళకి బుట్టబొమ్మ సీన్ టు సీన్ దింపేశారు అనిపించవచ్చు, చూడని వాళ్ళకి మాత్రం కొంచం ఓపిక చేసుకుని చూస్తె సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… సింపుల్ స్టొరీతో వచ్చిన బుట్టబొమ్మ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ ముందే చెప్పినట్లు ఓపిక అయితే ఉండాలి… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…