బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2 నెలలుగా సరైన సినిమాలు లేక టాలీవుడ్ లో ఎలక్షన్స్ మరియు IPL మ్యాచుల వలన అనుకున్న రేంజ్ లో సినిమాలు లేక పోవడం, వచ్చినా చిన్నా చితకా సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ ను అయితే చూపించలేక పోయాయి. ఎట్టకేలకు మే ఎండ్ లో ఆడియన్స్ ముందుకు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి….
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie), గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మరియు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా మూడు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ మూసి ఉన్న సింగిల్ స్క్రీన్స్ అన్నింటిలో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి…
ఉన్నంతలో మూడు సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి లీడ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది….టాక్ మరీ ఎంకరేజింగ్ గా లేదు కానీ ఉన్నంతలో మిగిలిన మూవీస్ తో పోల్చితే మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంటూ ఉంది. ఓవరాల్ గా గం గం గణేశ మరియు భజే వాయు వేగం సినిమాలు కొన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీలను సొంతం చేసుకున్నాయి..
ఓవరాల్ గా మూడు సినిమాలు కలిపి కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం, ఆల్ మోస్ట్ 2 నెలలుగా టాలీవుడ్ మూవీస్ లో ఆడియన్స్ ను మెప్పించిన సినిమాలు ఏవి లేవు, 2 నెలల తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో జనాలు తిరిగి థియేటర్స్ కి ఎగబడి వస్తూ ఉండటం హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉండటం విశేషం. ఇక మూడు సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.