C/O కంచెరపాలెం….వీకెండ్ కలెక్షన్స్…హిట్టు సినిమా బాస్!

0
1313

లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో ప్రేక్షకుల మెప్పు సంపూర్ణంగా పొందిన సినిమా C/O కంచెరపాలెం….స్లో గా మొదలైనా సినిమా చివరికి వచ్చే సరికి అద్బుతమైన ఫీలింగ్ ని కలిగించే ఈ సినిమా థియేటర్స్ నుండి వెళ్ళాక కూడా మన మనసుల్లో నిలిచిపోతుంది.

అంతగా ఇంప్రెస్ చేసే ఈ క్లాసిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు కురిపిస్తూ దూసుకుపోతుంది. రొటీన్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారు ఈ సినిమా కి దూరంగా ఉన్నా కానీ కొత్త కథలు, సరికొత్త కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారు మాత్రం సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. దాంతో సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో 1.45 కోట్ల వరకు షేర్ ని రాబట్టగలిగింది…అందులో ఎక్కువ మొత్తం ఓవర్సీస్ నుండి అధికంగా 40 లక్షల వరకు రాగా మిగిలిన మొత్తం రెండు రాష్ట్రాల్లో వచ్చింది.

సినిమాను ఓవరాల్ గా ఎక్కువ థియేటర్స్ లో ఓన్ గా రిలీజ్ చేసినా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 2 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఆ లెక్కన సినిమా బ్రేక్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు…మీరు సినిమా చూడకపోతే తప్పకుండా చూడండి…స్లోగా మొదలైనా ఎండింగ్ కి వచ్చేసరికి సినిమా అందరి మనసులను గెలుచుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here