బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adi Purush) వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపింది. కానీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ ఏరియాలో మాత్రం….
అండర్ పెర్ఫార్మ్ చేసి బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు. సినిమా రాయలసీమ లో మొత్తం మీద 17.60 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకుంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద 7.49 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. సినిమా సొంతం చేసుకున్న బిజినెస్ దృశ్యా సినిమా వీకెండ్ లో మినిమమ్ 10 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఉండాల్సింది. అలా జరిగి ఉంటే వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ఉన్నప్పటికీ…
లాంగ్ రన్ లో బిజినెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బిజినెస్ ను రాయలసీమ లో అందుకోవాలి అంటే ఇంకా 10.11 కోట్ల రేంజ్ ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రానున్న రోజుల్లో హాలిడేస్ కూడా లేక పోవడం, సినిమా నార్మల్ మాస్ మూవీ అవ్వక పోవడంతో రాయలసీమ సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఈ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి…