టాలీవుడ్ లో ప్రతీ ఏడాది కొన్ని సినిమాలు అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ ఉంటాయి…కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉంటాయి….రీసెంట్ టైంలో మిగిలిన ఏరియాల్లో ఎలా ఉన్నా కూడా రాయలసీమ ఏరియాల్లో కొత్త రికార్డులు…
చాలా రేర్ గానే నమోదు అవుతూ ఉండగా, ఏడున్నర ఏళ్ల క్రితం బాహుబలి2 ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తే ఆ రికార్డ్ ను మళ్ళీ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్రేక్ చేసింది. ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ ని అందుకోవడం ఇతర సినిమాలకు కష్టమే కానీ అదే టైంలో…
బాహుబలి2 కూడా చాలా రోజులుగా ఔట్ రీచ్ లో ఉండగా ఎట్టకేలకు రీసెంట్ గా వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీ బాహుబలి2 ని దాటేసి రాయలసీమ లో ఆర్ ఆర్ ఆర్ తర్వాత 35 కోట్ల షేర్ మార్క్ ని దాటిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది…
ఇక లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా 30 కోట్ల షేర్ మార్క్ ని ఇక్కడ అందుకోగా మిగిలిన ఏ సినిమాలు కూడా సీడెడ్ ఏరియాలో 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు..ఒకసారి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో సీడెడ్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
Ceeded Area All Time Highest Share Movies list
1). #RRRMovie – 51.04CR
2). #Pushpa2TheRule: 35.10CR********
3). #Baahubali2: 34.75CR
4). #Devara part 1 – 31.85CR
5). #Salaar-1: 22.75CR
6). #Baahubali: 21.8CR
7). #Kalki2898AD – 21.80CR
8). #SyeRaa: 19.11Cr
9). #WaltairVeerayya: 18.35Cr
10). #AlaVaikunthaPurramuloo: 18.27Cr
11). #Rangasthalam: 17.70CR
12). #AravindhaSametha: 17.64CR
13). #VeeraSimhaReddy: 16.52CR
14). #Akhanda – 16.05Cr
15). #SarileruNeekevvaru: 15.68Cr
ఓవరాల్ గా ఇవీ సీడెడ్ ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు…ఇక ఫ్యూచర్ లో భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపధ్యంలో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….మరి కొత్త రికార్డులను ఏ సినిమాలు అందుకుంటాయో చూడాలి.