Home న్యూస్ చక్రం Vs భారతీయుడు Vs ప్రేమకథాచిత్రం….ఏమవుతుందో ఇక!

చక్రం Vs భారతీయుడు Vs ప్రేమకథాచిత్రం….ఏమవుతుందో ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ ఆల్ మోస్ట్ ఎండ్ అయిపోబోతుంది, పెద్ద స్టార్స్ సినిమాలను రిలీజ్ చేస్తారు అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు…ఇక చిన్న మీడియం రేంజ్ మూవీస్ కూడా చాలా తక్కువగానే రిలీజ్ అవ్వగా దాదాపుగా అన్ని సినిమాలు ఆడియన్స్ ను నిరాశ పరిచాయి అనే చెప్పాలి. ఇలాంటి టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ కూడా…

రీసెంట్ టైంలో టాలీవుడ్ లో ఏమాత్రం వర్కౌట్ అవ్వడం లేదు కానీ ఇప్పటికీ కొందరు రీ రిలీజ్ లతో ఎంతో కొంత రెవెన్యూని జనరేట్ చేయాలి అన్న ఆశలో ఉన్నారు. కాగా మే ఎండ్ నుండి తిరిగి థియేటర్స్ లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా జూన్ 7-8 వీకెండ్ లో మాత్రం ఇప్పుడు కొత్త సినిమాలతో పాటు…

AP-TG 9th Day Highest Share Movies

మూడు పాత సినిమాలు కూడా రీ రిలీజ్ కి సిద్ధం అయ్యాయి…2 కొత్త సినిమాలు ఆ వీకెండ్ లో రిలీజ్ కానుండగా వాటికి పోటి ఇవ్వడానికి ప్రభాస్(prabhas) నటించిన చక్రం(Chakram Movie), సుదీర్ బాబు కెరీర్ బెస్ట్ హిట్ ప్రేమకథాచిత్రం(Prema Katha Chitram) తో పాటు కమల్ హాసన్ బెస్ట్ మూవీస్ లో ఒకటైన భారతీయుడు1(Bhaarateedudu) సినిమాలు రిలీజ్ కానున్నాయి…

వీటిలో భారతీయుడు సినిమా రెండో పార్ట్ కి నెల ముందు ఆడియన్స్ కి మరోసారి కథ గురించి తెలియాలి కాబట్టి రీ రిలీజ్ చేస్తున్నారు, కానీ చక్రం- ప్రేమకథాచిత్రం సినిమాలు ఎందుకు రీ రిలీజ్ అవుతున్నాయో మేకర్స్ కే తెలియాలి…ఎలాంటి అకేషన్ లేకుండా వాటిని రీ రిలీజ్ చేస్తూ ఉండగా…

ఎంతో కొంత ప్రేమకథాచిత్రం లో కామెడీ అయినా ఉంటుంది కాబట్టి ఎవరైనా చూడటానికి వస్తారేమో కానీ చక్రం సినిమా వద్దు బాబు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేసినా కూడా ఆ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు…మరి కొత్త మరియు రీ రిలీజ్ ల పోటితో జూన్ 7-8 వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కళకళలాడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here