Home న్యూస్ రీ రిలీజ్ కానున్న డిసాస్టర్ చక్రం….ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చిందిగా!!

రీ రిలీజ్ కానున్న డిసాస్టర్ చక్రం….ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చిందిగా!!

0

టాలీవుడ్ లో ఈ ఇయర్ మొదటి మూడు నెలల తర్వాత థియేటర్స్ ఏమాత్రం ఫుల్ అవ్వడం లేదు, అనుకున్న సినిమాలు తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండగా ఎలక్షన్స్ ఇంపాక్ట్ వలన కొత్త సినిమాలు ఏవి కూడా ఏమాత్రం అంచనాలను అందుకోవడం లేదు….ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారు కానీ…

ఆ సినిమాలు కూడా పెద్దగా జోరు చూపించని ఈ టైంలో ఏవైనా హిట్ మూవీస్ ని రీ రిలీజ్ చేసినా ప్రయోజనం ఉండేది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచిన సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచింది ఇప్పుడు..ఆ సినిమానే ప్రభాస్(Prabhas) కెరీర్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా కూడా….

బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న చక్రం(Chakram Movie Re Release)…మే నెలలో బాక్స్ ఆఫీస్ మరింత చల్లబడిపోయిన టైంలో ఈ సినిమాను త్వరలో రీ రిలీజ్ చేయబోతున్నామంటూ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ కి ఈ న్యూస్ చూసి చిర్రెత్తుకొచ్చింది….

ఈ సినిమాలో ఏముందని రీ రిలీజ్ చేస్తున్నారు…లాస్ట్ కి హీరో చనిపోతే అప్పుడు మేం థియేటర్స్ లో పేపర్స్ విసిరి, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేయాలా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రీ రిలీజ్ చేయాలి అనుకుంటే మంచి సినిమాలు ఎన్నో ఉన్నాయి, అవి కూడా ఇలా ఫ్లాఫ్ అయిన మూవీ ని రిలీజ్ చేయడం…

ఆ సినిమాలకు జనాలు రాకపోతే ఇతర హీరోల ఫ్యాన్స్ కలెక్షన్స్ రాలేదని ట్రోల్స్ చేయడం జరుగుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ ను వద్దంటే వద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి చక్రం సినిమా రీ రిలీజ్ అవుతుందో లేక రిలీజ్ ఆగిపోతుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here