ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 9.4 ఐఎంబీడీ, 9.1 బుక్ మై షో రేటింగ్ సాధించిన ‘చక్రవ్యూహం'(Chakravyuham) చిత్రం ప్రముఖ ఓటీపీ దిగ్గజ సంస్థ అయినా ‘అమెజాన్ ప్రైమ్’ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యాక్టర్ అజయ్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనతో మెప్పించిన చక్రవ్యూహం ఈ వీకెండ్ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రేలీజ్ చేసిన ఈ చిత్రం 1 గంట 47 నిముషాల నిడివితో అద్భుతమైన మరియు ఉత్కంటబరితమైన కథా, కథనంతో థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శించబడి విడుదలైన అన్ని సెంటర్లలో ప్రేక్షకుల చేత పాజిటివ్ పేరు తెచ్చుకున్న చక్రవ్యూహం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘చక్రవ్యూహం : ది ట్రాప్’ మూవీలో వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి నటించారు.
ప్రముఖ నటి జ్ఞానేశ్వరి కండ్రేగుల ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. చెట్కూరి మధుసూదన్ రచన దర్శకత్వంలో మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని శ్రీమతి సావిత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.కథ విషయానికి వస్తే అనాధ అయిన సంజయ్( వివేక్ త్రివేది) శరత్( సుదేశ్) ఇద్దరూ మంచి స్నేహితులు. శరత్ ద్వారా పరిచయమైన సిరి( ఊర్వశి పరదేశి) సంజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇక శరత్, సంజయ్ లిద్దరూ కన్స్ ట్రక్షన్ బిజినెస్ ను ప్రారంభిస్తారు. అంతా సవ్యంగానే ఉంది అన్న తరుణంలో…
సంజయ్ భార్య సిరి హత్యకు గురి అవ్వడంతో కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. కథ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో శరత్ కూడా హత్యకు గురి అవుతాడు. ఎవరు ఊహించని సస్పెన్స్ సన్నివేశాలతో ఈ రెండు హత్యలు వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో ‘చక్రవ్యూహం’ ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ గా అజయ్ ఎలా ఛేదించాడు అనేదే ‘చక్రవ్యూహం’ కథ.
జూన్ 2న థియేటర్లో విడుదలైన చక్రవ్యూహం మూవీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకొని ఘనవిజయం సాధించింది. ఒళ్ళు గగుర్పొడిచే సస్పెన్స్ సన్నివేశాలతో థియేటర్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ చిత్రం జూలై 5 నుంచి ఇండియా బెస్ట్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో దిగ్విజయంగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో విజయం సాధించిన ఈ చిత్రం ఓటీపీలో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.