బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన చంద్రముఖి(Chandramukhi) సినిమాకి ఆల్ మోస్ట్ 18 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ మూవీ చంద్రముఖి2(Chandramukhi2) పై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాకా…
ఆడియన్స్ లో సినిమా మీద క్యూరియాసిటీ తగ్గిపోయింది. తెలుగు లో హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చి వెళ్లి ఆ కాన్సెప్ట్ ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయి ఇప్పుడు మేకర్స్ కూడా ఆ కాన్సెప్ట్ ను ముట్టడం లేదు… ఇలాంటి టైం లో చంద్రముఖి2…
మళ్ళీ అదే పాయింట్ తో వస్తూ ఉండటంతో పారడీ మూవీలా అనిపిస్తూ ఉండగా టాక్ పాజిటివ్ గా ఉంటే తప్ప లెక్కలు మారేలా లేవు ఇప్పుడు. ఇక సినిమాకి ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు మంచి బిజినెస్ ఆఫర్స్ తెలుగు లో కూడా సొంతం అవ్వగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత….
అలాగే డేట్ పోస్ట్ పోన్ అయ్యి భారీ పోటిలో వస్తూ ఉండటంతో బిజినెస్ లో మార్పులు జరుగుతున్నాయి. ముందు నైజాం ఏరియా బిజినెస్ 4 కోట్ల కు పైగా ఆఫర్స్ రాగా ఇప్పుడు ఆ రేటు తగ్గిపోయింది… అటూ ఇటూగా 3 కోట్ల దాకా బిజినెస్ ఆఫర్స్ ను…
ఈ సినిమా సొంతం చేసుకుంటూ ఉండగా మేకర్స్ 4 కోట్ల దాకా రేటు వస్తే ఓకే చేస్తామని ఎదురు చూస్తున్నారు… కానీ రేటు పెరిగే అవకాశాలు తక్కుగానే ఉండటంతో ఈ రేటు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సినిమా 28 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మరి ఎంతవరకు సినిమా మెప్పిస్తుందో చూడాలి.