బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్ లో నే పోటిలో రిలీజ్ అవ్వాల్సిన రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన స్కంద(Skanda Movie) అలాగే రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన చంద్రముఖి2(Chandramukhi2 Movie)….
రెండూ పోటిలో రిలీజ్ అవ్వాల్సింది కానీ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రెండు సినిమాల ట్రైలర్ లకు కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయింది….
కానీ బోయపాటి శ్రీను మాస్ ఫ్యాక్టర్ స్కంద సినిమాకి భారీ అడ్వాంటేజ్ కాగా చంద్రముఖి సీక్వెల్ అవ్వడం చంద్రముఖి2 అడ్వాంటేజ్ అయినా ఈ కాన్సెప్ట్ తో అనేక సినిమాలు ఆల్ రెడీ ఎన్నో వచ్చి ఈ కాన్సెప్ట్ అరిగిపోవడంతో ఇప్పుడు వర్కౌట్ అయ్యే అవకాశం…
చాలా తక్కువగా ఉండటంతో కమర్షియల్ మాస్ మూవీ అయిన స్కంద రొటీన్ గానే అనిపిస్తున్నా కూడా మాస్ ఎలిమెంట్స్ ఫుల్లుగా ఉండే అవకాశం ఎంతైనా ఉండటంతో చంద్రముఖి2 మీద స్కందకి ఇది బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. దాంతో చంద్రముఖి2 కి పోటిలో…
స్కందని తట్టుకోవడం చాలా కష్టమే అని చెప్పాలి ఇప్పుడు… ఒవవేల సినిమా కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తే స్కంద ఓపెనింగ్స్ కి కొంచం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అయినా కానీ రామ్ పోతినేని బోయపాటి శ్రీనుల స్కంద బిగ్ మాస్ ఓపెనింగ్స్ ను మీడియం రేంజ్ మూవీస్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.