టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంచుకున్న సినిమాల సెలెక్షన్ అద్బుతంగా ఉంటూ వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆచార్య లో స్పెషల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ తర్వాత ఇండియా లీడింగ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ డైరెక్షన్ లో కొత్త సినిమా ను కమిట్ అయిన విషయం తెలిసిందే, ఈ కాంబినేషన్ ని అసలు ఎవ్వరూ ఊహించలేదు అని చెప్పొచ్చు. అలాంటి కాంబినేషన్ ని కన్ఫాం చేసి…
ఫ్యాన్స్ కి అల్టిమేట్ గుడ్ న్యూస్ ని చెప్పిన రామ్ చరణ్ ఇప్పుడు ఎందుకో కొద్దిగా నిరాశలో ఉన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది, దానికి కారణం డైరెక్టర్ శంకర్ పై కోలివుడ్ లో నెలకొన్న నెగటివ్ రిమార్కులు అని చెప్పొచ్చు. శంకర్ ఇది వరకు కమిట్ అయిన సినిమాల…
యూనిట్ లు కానీ నిర్మాతలు కానీ శంకర్ పై ఈ మధ్య వరుసగా కామెంట్స్ చేస్తున్నారు, ఇండియన్ 2 నిర్మాతలు అయిన లైకా వాళ్ళు అయితే శంకర్ ఇండియన్ 2 ని కంప్లీట్ చేశాకే ఇతర సినిమాల జోలికి వెళ్ళాలి అంటూ గట్టిగానే చెబుతున్నారు. కానీ ఎవ్వరూ వినడం లేదు…
మరో పక్క అపరిచితుడు హిందీ రీమేక్ పై ఒరిజినల్ నిర్మాత ఇప్పటికీ కోలివుడ్ పెద్దలతో మీటింగ్ లు పెడుతూ ఈ సినిమా కూడా ఆపాలని కోరుతున్నారట. ఇదంతా తెలుసుకున్న రామ్ చరణ్ శంకర్ తో సినిమా నిర్మాత అయిన దిల్ రాజు తో శంకర్ ఇతర ప్రాజెక్టులు కంప్లీట్ చేశాకే సినిమాను మొదలు పెట్టాలా లేదా ఈ సినిమాను ముందు మొదలు పెడతామా అన్న…
ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, మొత్తం మీద రామ్ చరణ్ ఒక నిర్ణయానికి వచ్చారని, శంకర్ ఇతర ప్రాజెక్టులు కంప్లీట్ చేసే లోపు వేరే సినిమా ను కమిట్ అయితే ఈ లోపు శంకర్ ఆ పెండింగ్ సినిమాలను ఇతర ఇష్యూలను సరి చేసుకుంటే ఈ సినిమా వచ్చే నాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారట. త్వరలోనే శంకర్ తో ఈ విషయం చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.