Home న్యూస్ ఛావా తెలుగు బిజినెస్….థియేటర్స్ కౌంట్…మాస్ కుమ్ముడు ఖాయం!!

ఛావా తెలుగు బిజినెస్….థియేటర్స్ కౌంట్…మాస్ కుమ్ముడు ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో హిందీ మార్కెట్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) మాస్ రికార్డ్ ను సృష్టించి హిస్టారికల్ జానర్ లో అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసిన తర్వాత ఇప్పుడు తెలుగు వర్షన్ ఆడియన్స్ ముందుకు…

ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగు డబ్ వర్షన్ మీద ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు ఉండగా భారీ లెవల్ లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్ మోస్ట్ 550 వరకు స్క్రీన్స్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా….

ఇక సినిమా తెలుగు డబ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 2.75 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….సినిమా రీసెంట్ టైంలో హిందీ నుండి తెలుగు లో డబ్ అవుతున్న మూవీస్ లో ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా చెప్పుకోవాలి….

ఇక సినిమా తెలుగులో క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లో వాల్యూ షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు ఓపెనింగ్స్ బాగా ఉండే అవకాశం ఉండగా…

సినిమా ఆల్ రెడీ హిందీ లో 650 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో రచ్చ చేయగా ఇప్పుడు తెలుగు డబ్ వర్షన్ అనుకున్న అంచనాలను అందుకుంటే ఇక్కడ కూడా కలెక్షన్స్ పరంగా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here