2015 లో గీతా ఆర్ట్స్ నుండి సబ్ ప్రొడక్షన్ హౌస్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ని మొదలు పెట్టగా, అప్పటి నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి, భలే భలే మోగాడి వోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతీ రోజూ పండగే లాంటి బాక్ టు బాక్ సూపర్ హిట్స్ ని సొంతం చేసు కున్న ఈ బ్యానర్ నుండి రూపొందిన లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా…
కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా మొదటి రోజు ఎలాగోలా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత మాత్రం కంప్లీట్ గా స్లో అయిన ఈ సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఇంకా స్లో అవ్వడం ఖాయం అనుకోగా…
అనుకున్నట్లుగానే సినిమా భారీగా స్లో డౌన్ అయ్యి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 21 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుని కంప్లీట్ గా డౌన్ అయింది, దాంతో సినిమా ఇక తేరుకోవడం కష్టమే అని కన్ఫాం అయ్యింది అని చెప్పాలి.
మొత్తం మీద సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.14Cr
👉Ceeded: 52L
👉UA: 34L
👉East: 22L
👉West: 13L
👉Guntur: 22L
👉Krishna: 24L
👉Nellore: 13L
AP-TG Total:- 2.94CR (4.77Cr Gross~)
Ka+ROI: 8L
OS – 13L
Total WW: 3.15CR( 5.17Cr Gross~)
సినిమా బిజినెస్ 13 కోట్లు కాగా 13.5 కోట్ల టార్గెట్ లో ఇంకా 10.35 కోట్ల షేర్…
ఇంకా బ్రేక్ ఈవెన్ కి కావాలి, సినిమా సగానికి పైగా నష్టాలు మినిమమ్ సొంతం చేసుకునేలా ఉండటం తో ఆల్ మోస్ట్ గీతా ఆర్ట్స్ 2 నుండి మొట్ట మొదటి బిగ్ ఫ్లాఫ్ మూవీగా ఈ సినిమా నిలవడం ఖాయం అయ్యింది, ఇక కొత్త సినిమాల కోసం ఈ సినిమా థియేటర్స్ కూడా చాలా వరకు ఇచ్చేయడం కూడా ఖాయమని చెప్పొచ్చు.