బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెక్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ పరుగును కొనసాగించగా దానికి తోడూ టికెట్ హైక్స్ కూడా పెట్టడం తో మాస్ సెంటర్స్ లో సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేకుండా పోయారు, దాంతో అది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై తీవ్రంగా ఇంపాక్ట్ చూపి ప్రతీ రోజూ కలెక్షన్స్…
అంచనాలను అందుకోలేక అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వచ్చాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో అయితే కంప్లీట్ గా స్లో డౌన్ అయింది, కలెక్షన్స్ పరంగా ఇక బిజినెస్ ను అందుకునే అవకాశమే లేదని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7 వ రోజు సాధించిన షేర్…
10 లక్షల రేంజ్ లో ఉంది అంటే ఏ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జలక్ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా ఒక్క అమెరికాలో కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల మాత్రం తీవ్ర నిరాశనే మిగిలించి భారీ నష్టాల వైపు అడుగులు వేస్తుంది.
మొత్తం మీద సినిమా మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే..
👉Nizam: 3.20Cr
👉Ceeded: 96L
👉UA: 1.13Cr
👉East: 45L
👉West: 55L
👉Guntur: 92L
👉Krishna: 53L
👉Nellore: 28L
AP-TG Total:- 8.02CR (14.08Cr Gross~)
KA + ROI: 31L Corrected
OS – 68L
Total: 9.01Cr(16.50Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా ని మొత్తం మీద 16.1 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర 16.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 7.47 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక ఆ అవకాశమే లేదు కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా పరుగును ముగించబోతుంది అని చెప్పాలి…