బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో రికార్డులను సృష్టిస్తున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ అన్ని చోట్లా మాస్ భీభత్సం సృష్టించి ఏకంగా 300 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా రెండో వీకెండ్ లో సినిమా బాలీవుడ్ లో హిందీ సినిమాల పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది..
రెండో వీకెండ్ లో బాలీవుడ్ తరుపున 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా నిలిచింది….ఓవరాల్ గా చూసుకుంటే రెండో వీకెండ్ లో ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న రెండో సినిమాగా నిలిచింది ఛావా సినిమా…రెండో వీకెండ్ లో ఓవరాల్ గా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 128 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…. ఇప్పుడు ఇక హిందీ సినిమాల పరంగా ఛావా సినిమా కన్నా ముందు లాస్ట్ ఇయర్ వచ్చిన…
స్త్రీ2 సినిమా రెండో వీకెండ్ లో 93.85 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా..ఇప్పుడు ఈ రికార్డ్ ను ఏకంగా 15 కోట్ల రేంజ్ లీడ్ తో బ్రేక్ చేసిన ఛావా సినిమా రెండో వీకెండ్ లో 109.23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ సంచలనం సృష్టించింది…
ఓవరాల్ గా అన్ సీజన్ లో బాలీవుడ్ లో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న ఛావా సినిమా 10 రోజుల్లో 334 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా లాంగ్ రన్ లో అవలీలగా 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి.