హాలిడే వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఉంటే రికార్డుల భీభత్సం మరో లెవల్ లో సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ రష్మిక మందన నటించిన ఛావా(Chhaava Movie) మూవీ వీకెండ్ లో హిస్టారికల్ జానర్ లో వచ్చిన మూవీస్ లో హిందీ లో రికార్డ్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది…
సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా 120 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా రిమార్కబుల్ హోల్డ్ ని నాలుగో రోజు అన్ని చోట్లా చూపించిన సినిమా అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….
మొత్తం మీద 4వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనిపించేలా 6 లక్షలకు పైగా టికెట్ సేల్స్ ను బుక్ మై షో లో సొంతం చేసుకుని ఊచకోత కోసిన ఈ సినిమా ఓవరాల్ గా 24.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపించడం విశేషం..
అందులో కూడా ఒక్క మహారాష్ట్రలోనే సినిమా 15 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది..ఓవరాల్ గా సినిమా 4 రోజుల్లో ఇప్పుడు ఇండియాలో 145.5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించగా వీక్ లోనే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల..
నెట్ కలెక్షన్స్ మార్క్ ని అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది అనిపించే రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. నార్మల్ వీక్ లోనే ఇలా ఉంటే హాలిడే వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా భీభత్సం ఇంకో లెవల్ లో ఉండేది అని చెప్పొచ్చు…