బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో రీసెంట్ టైంలో సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమాలలో విక్కీ కౌశల్ రష్మిక మందన నటించిన ఛావా(Chhaava Movie) ఒకటి…ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ పెరిగిపోయి ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే….ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాడానికి తెలిసిన ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యం మొత్తాన్ని స్వాదీనం చేసుకోవాలని చూస్తాడు. ఇలాంటి టైంలో ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంభాజీ మొగల్ సామ్రాజ్యం పై దండెత్తి మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని వార్నింగ్ ఇస్తాడు…దాంతో ఔరంగజేబు స్వయంగా యుద్దభూమిలోకి దిగుతాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
హిస్టారికల్ కథతో వచ్చిన ఛావా సినిమా ఆరంభం అద్బుతంగా ఉండగా ఎక్స్ లెంట్ ఫైట్ సీన్ తో సినిమా ఓ రేంజ్ లో హై ఇస్తూ కథ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా స్లో అవుతుంది….మరాఠా సామ్రాజ్యంలో హీరోకి వెన్నుపోటు పొడవడానికి ఎలాంటి పన్నాగాలు జరుగుతున్నాయి, హీరో వ్యక్తిగత జీవితం ఇలా సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ డ్రామా నడుస్తుంది కానీ…
అసలు కథ సెకెండ్ ఆఫ్ లో మొదలు అవుతుంది, ఫైట్ సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ పర్వాలేదు అనిపించేలా ఉండగా ఇంపాక్ట్ కొంచం తక్కువ అవుతుంది అనుకుంటున్నా టైంలో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఓ రేంజ్ లో హై ఇచ్చి తర్వాత అదే రేంజ్ లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది…
విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పాలి ఈ సినిమాలో…డ్రామా సీన్స్ లో తన డైలాగ్స్, పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించగా, దానికి మించి యాక్షన్ సీన్స్ లో తను రెచ్చిపోయిన తీరు మరో లెవల్ అని చెప్పాలి….స్టార్టింగ్ ఫైట్ సీన్ తర్వాత సింహంతో ఫైట్ సీన్….సెకెండ్ ఆఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుండి పూర్తిగా తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు…
క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంటూనే తెరపై చూడటం కష్టంగా అనిపిస్తుంది. ఆడియన్స్ ఆ సీన్స్ ని ఫీల్ అయ్యేలా తన పెర్ఫార్మెన్స్ మరో లెవల్ లో ఆకట్టుకుంటుంది. ఇక రష్మిక రోల్ ఉన్నంతలో బాగుండగా ఔరంగజేబు గా చేసిన అక్షయ్ ఖన్నా మెప్పించాడు…
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదు, సరైన సాంగ్స్ అండ్ హై ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ పడి ఉంటే చాలా సీన్స్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యేవి…మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా హిస్టారికల్ కథతో వచ్చిన ఛావా గురించి…
ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలిసింది తక్కువే కాబట్టి ఒక్కసారి అయితే తప్పకుండా చూసి తీరాల్సిందే…సినిమా కొంచం స్లో నరేషన్ తో ఉన్నా కూడా ఎండ్ అయ్యే టైం థియేటర్స్ నుండి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి రావడం ఖాయం… సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్…