హిందీ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను తలపిస్తూ సంచలన రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) లో డబ్ అయ్యి గ్రాండ్ గా రిలీజ్ అయింది….ఆల్ రెడీ తెలుగు రాష్ట్రాల్లో హిందీ వర్షన్ ని చూసినా కూడా తెలుగు వర్షన్ లో చూడాలి అనుకున్న వాళ్ళ….
సంఖ్య కూడా ఎక్కువే ఉండటంతో ఈ డబ్ వర్షన్ వచ్చింది అని తెలిసి ఎగబడి థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు. ఇక సినిమా తెలుగు వర్షన్ ఎలా ఉంది…..ఎలా ఆకట్టుకుంది లాంటి విశేషాలను గమనిస్తే…కథ పాయింట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాడానికి తెలిసిన ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యం మొత్తాన్ని స్వాదీనం చేసుకోవాలని చూస్తాడు.
ఇలాంటి టైంలో ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంభాజీ మొగల్ సామ్రాజ్యం పై దండెత్తి మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని వార్నింగ్ ఇస్తాడు…దాంతో ఔరంగజేబు స్వయంగా యుద్దభూమిలోకి దిగుతాడు…ఇక ఆ తర్వాత జరిగిన భీకర యుద్ధం ఎలా ముగిసింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
పెర్ఫార్మెన్స్ లు పరంగా అందరూ ఓ రేంజ్ లో కుమ్మేయగా….విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపించాడు సినిమాలో….తెలుగు డబ్బింగ్ కూడా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ కి ఎక్స్ లెంట్ గా సెట్ అయ్యింది….కొంచం పేరున్న యాక్టర్స్ తో డబ్బింగ్ కనుక చెప్పించి ఉంటే ఇంపాక్ట్ ఇంకా సాలిడ్ గా ఉండేది…
హిస్టరీ లో జరిగిన విషయాలను చాలా వరకు ఆడియన్స్ కి నచ్చేలా తీయడంలో డైరెక్టర్ సఫలం అవ్వగా….సినిమాలో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా ఉండగా…మోడతో సింహంతో పోరాట సన్నివేశం…తర్వాత యాక్షన్ ఎపిసోడ్ లు…ఇక క్లైమాక్స్ పోర్షన్ మొత్తం…..
కొంచం ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టేలా ఉన్నా కూడా ఆడియన్స్ కి రోమాలు నిక్కబోర్చుకోవడం ఖాయమని చెప్పాలి….ఆల్ రెడీ హిందీ లో చూసిన వాళ్ళు మరోసారి తెలుగులో చూడొచ్చు..తెలుగులోనే చూడాలి అనుకున్న వాళ్ళని సినిమా మరింత ఆకట్టుకోవడం ఖాయం..ఓవరాల్ గా రీసెంట్ టైములో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హిస్టారికల్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి అని చెప్పొచ్చు.