టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, సైరా నరసింహా రెడ్డి తర్వాత వరుస పెట్టి ఏడాదికి రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావాలి అనుకున్నా కానీ ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ల ఎఫెక్ట్ వలన అన్ని ప్లాన్స్ మారిపోగా అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మెగాస్టార్ అప్ కమింగ్ మూవీస్ అనౌన్స్ మెంట్ లు రీసెంట్ గా జరగగా…
అందులో అన్నీ కూడా మాస్ కంటెంట్ తో లోకల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న సినిమాలుగా అనిపించాయి. ఇక ఇదే టైం లో మెగాస్టార్ మూవీస్ లో షూటింగ్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయిన మూవీ ఆచార్య ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుంది అన్నది పుట్టిన రోజుకి…
అప్ డేట్ చేస్తారు అనుకున్నా కానీ చేయలేదు, పరిస్థితులు నార్మల్ అయ్యాకే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉండగా ఈ సినిమా కేవలం డైరెక్ట్ తెలుగు మాత్రమే అని అంతా అనుకున్నారు కానీ మెగాస్టార్ పుట్టిన రోజు టైం లో…
సినిమా తాలూకు పోస్టర్ ఒకటి ఆడియన్స్ కి షాక్ కి గురి చేసింది. ఆ పోస్టర్ ప్రకారం సినిమా హిందీ లో కూడా రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు. ఆల్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా రైట్స్ ను భారీ రేటు పెట్టి కొన్న పెన్ మూవీస్ వాళ్ళు ఆచార్య మూవీ హిందీ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. కాగా వాళ్ళు ఇప్పుడు….
ఈ సినిమాను హిందీ లో కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ అఫీషియల్ గా కన్ఫాం చేశారు. బాలీవుడ్ లో సైరా నరసింహా రెడ్డి 25 కోట్ల బిజినెస్ 45 కోట్ల నెట్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 9.85 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించి డిసాస్టర్ అయ్యింది, అయినా కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ కాబోతుండటం ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో ఉండటం తో ఈ సినిమాను హిందీ లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుందట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.