Home గాసిప్స్ మెగాస్టారా మజాకా…బాలీవుడ్ రికార్డులు తిరగరాశాడుగా!!

మెగాస్టారా మజాకా…బాలీవుడ్ రికార్డులు తిరగరాశాడుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత మెగా కంబ్యాక్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా తో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించాడు. ఆ సినిమా తర్వాత రెండేళ్ళకి మళ్ళీ సైరా నరసింహా రెడ్డి తో మెప్పించగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళ టైం కి కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు…

ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుండగా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉండగా…

దసరా టైం లో కానీ దీపావళి టైం లో కానీ ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలన్న ఆలోచన అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా కి బిజినెస్ ఆల్ రెడీ మొదలు అవ్వగా సినిమా తెలుగు ఆడియో రైట్స్ పరంగా ఆల్ రెడీ రికార్డ్ ను క్రియేట్ చేసి 4 కోట్ల రేటు ని సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు రీసెంట్ గా సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కూడా టాలీవుడ్ తరుపున ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను బాలీవుడ్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ అలాగే యూట్యూబ్ రైట్స్ రెండూ కలిపి ఏకంగా 26 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయ్యిందని…

ఇప్పుడు ట్రేడ్ లో వార్తలు వినిపిస్తుంది…. టాలీవుడ్ తరుపున ఏ సినిమా కైనా కానీ ఇది ఆల్ టైం ఎపిక్ హైయెస్ట్ రేటు గా చెబుతున్నారు. మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న ఈ సినిమా హైప్ కి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక మెగాస్టార్ పుట్టిన రోజు టైం కి సినిమా రిలీజ్ డేట్ పై పక్కా అనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here