టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఆచార్య, ఆల్ మోస్ట్ 1 ఏడాదికి పైగా టైం తీసుకున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కొంచం బాలెన్స్ ఉండగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ వలన అలాగే ఈ ఇయర్ సెకెండ్ వేవ్ వలన షూటింగ్ కి తీవ్ర అంతరాయం కలిగి సినిమా రిలీజ్ డేట్ పై ఆ ఇంపాక్ట్ పడి మరోసారి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంది.
ఇక సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుంది అన్నది త్వరలో కన్ఫాం అవుతుందని అంటూ ఉండగా రీసెంట్ గా సినిమాలో క్లైమాక్స్ సీన్స్ గురించిన ఒక లీక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ లీక్ మెగా ఫ్యాన్స్ కి ఒకింత శాకిచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.
ఆ న్యూస్ ఏంటంటే… సినిమా క్లైమాక్స్ లో కీలక రోల్ చేస్తున్న రామ్ చరణ్ పాత్ర చనిపోతుందని, ఆ పాత్ర చనిపోవడం వలన మెగాస్టార్ పాత్ర విలన్స్ పై విరుచుకు పడి అందరినీ చంపేస్తాడని ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది..
తెలియాల్సి ఉండగా కొరటాల శివ కూడా రామ్ చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటూనే ఆ పాత్ర ముగింపు ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు తిరిగేలా చేస్తుందని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆ లెక్కన రామ్ చరణ్ చేస్తున్న సిద్దా రోల్ కి సాడ్ ఎండింగ్ ఉండటం ఆల్ మోస్ట్ ఖాయమని అప్పటి నుండే వార్తలు రాగా ఇప్పుడు వచ్చిన కొత్త లీక్…
మరో సారి ఇది నిజమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పకనే చెబుతుంది. ఒకవేళ నిజం అయితే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తి కరం, ఆ పాత్ర ముగింపు నుండే చిరు రోల్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తాల్లో ఎంతవరకు నిజముంది అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.