టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు, ఖైదీ నంబర్ 150 తో కమర్షియల్ కంబ్యాక్ తో 100 కోట్లు కొల్లగొట్టిన మెగాస్టార్ తర్వాత సైరా తో అంచనాలను అందుకోక పోయినా బాక్స్ ఆఫీస్ ను బాగానే షేక్ చేశాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో అపజయం అంటే తెలియని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య తో సమ్మర్ రేసులో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు..
కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అవ్వగా టీసర్ కి రెస్పాన్స్ మరో లెవల్ లో వచ్చింది, రామ్ చరణ్ వాయిస్ ఓవర్, మెగాస్టార్ లుక్స్, కొరటాల టేకింగ్, యాక్షన్ బ్లాక్స్ ఇలా టీసర్ లో బాగానే హైలెట్ అయ్యాయి. దాంతో సినిమా పై ఉన్న హైప్ మరింతగా…
పెరిగి పోగా…సినిమా ఇప్పుడు ట్రేడ్ లో హాట్ బజ్ ని క్రియేట్ చేస్తుంది, ఆల్ మోస్ట్ బిజినెస్ క్లోజ్ రేంజ్ కి చేరుకుంది సినిమా… అందులో ఒక్క నైజాం ఏరియాలోనే సినిమా ఆల్ టైం ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇది వరకు నైజాం ఏరియాలో….
బాహుబలి మరియు సాహో సినిమాలు 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆచార్య సినిమా ఒక్కటే అఫీషియల్ గా 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా క్రాక్ ని డిస్ట్రిబ్యూషన్ చేసిన కార్తికేయ ఎగ్జిబిటర్స్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందులో 4 కోట్లు రిఫండబుల్ గా ఉంటుంది, అంటే… సినిమా ఒకవేళ అంచనాలను అందుకోక పొతే…నిర్మాతలు…
అమౌంట్ నుండి 4 కోట్ల దాకా వెనక్కి ఇస్తారు అన్న మాట. అలా కాకుండా భారీ విజయం సాధిస్తే… ఆ బిజినెస్ కౌంట్ అవుతుంది. ఓవరాల్ గా అల్టిమేట్ బిజినెస్ తో ట్రేడ్ కి సాలిడ్ షాక్ ఇచ్చి మెగాస్టార్ నార్మల్ మూవీ తోనే పాన్ ఇండియా మూవీస్ రేంజ్ బిజినెస్ తో ఊచకోత కోస్తున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో మే 13 న తేలనుంది.