Home గాసిప్స్ షాకింగ్…రేసు నుండి తప్పుకున్న ఆచార్య!!

షాకింగ్…రేసు నుండి తప్పుకున్న ఆచార్య!!

522
0

10 ఏళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150 తో టాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తో మరోసారి మెప్పించి నా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ విజయాన్ని అందు కోలేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న తన అప్ కమింగ్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా ను తక్కువ టైం లో షూటింగ్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు.. ఈ ఏడాది ఆగస్టు లో రిలీజ్ అనుకున్నా కానీ లాక్ డౌన్ వలన షూటింగ్ మొత్తం ఆగిపోగా… సినిమా రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయింది.

ఆగస్టు నుండి దసరా కి, దసరా నుండి దీపావళి కి తర్వాత ఈ ఇయర్ రిలీజ్ కాదని కన్ఫాం అవ్వగా ఎలాగైనా సంక్రాంతి బరిలో సినిమా ను నిలపాలి అని ట్రై చేస్తున్నారు కానీ పరిస్థితులు కలిసి రాక పోవడం, కరోనా ఎఫెక్ట్ ఎటు నుండి వస్తుందో తెలియక పోవడం తో….

లేట్ అయినా పర్వాలేదు అందరూ సేఫ్ గా ఉన్నప్పుడే సినిమా ను తిరిగి సెట్స్ పైకి తీసుకు వెళదాం అని టీం నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలుస్తుంది అనుకున్న చిరు 152 వ సినిమా ఆచార్య ఇప్పుడు అఫీషియల్ గానే సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్లు కన్ఫాం అయ్యిందని చెప్పొచ్చు.

ఇక పరిస్థితులు సద్దుకున్నాక వచ్చే ఏడాది సమ్మర్ రేసు లో సినిమాను నిలపాలి అన్న ఆలోచన లో టీం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సంక్రాంతి కి చిరు సినిమా తప్పుకోవడం తో మిగిలిన కొన్ని షూటింగ్ చివరి దశలో ఉన్న క్రేజీ సినిమా లు సంక్రాంతి రేసు లో ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here