ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇద్దరూ కూడా హిట్స్ కొట్టారు…. చిరు వాల్తేరు వీరయ్యతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తే బాలయ్య కూడా జోరు చూపించాడు… కాగా ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల సినిమాల లేటెస్ట్ సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి. ముందుగా బాలయ్య వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్ లో మాటలో మాటగా అప్పట్లో నాన్నగారితో మాట్లాడుకుంటూ…
రంగారావు, అక్కినేని తొక్కినేని అంటూ మాట జారాడు…. స్టేజ్ పైన అప్పుడప్పుడు ఇలా మాటలు అనుకోకుండా జారతాడు అని పేరున్న బాలయ్య అన్ స్టాపబుల్ తర్వాత మంచి పేరుకి మరింత క్రేజ్ ను సొంతం చేసుకోగా ఈ ఒక్క మాటతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ పడగా అక్కినేని యంగ్ హీరోలు దీని పై స్పందించడం…తర్వాత బాలయ్య దానికి వివరణలు ఇచ్చుకోవడం జరిగింది…
ఈ ఈవెంట్ జరిగిన వారంతో వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ ఈవెంట్ జరగగా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజని తన కన్నా చిన్న వాడు అన్న ఉద్దేశ్యంతో అన్నాడో లేక ఎలా అన్నాడో కానీ డైరెక్టర్ ఇలా చెప్పాడు అంటూ ఓ చిన్న హీరో పోస్టర్ ను తుడవడంతో పాటు ఫోటోకి ముద్దు పెట్టడం అంటే మామూలు విషయం కాదు అంటూ కామెంట్ చేశాడు…
దాంతో ఈ మాటలను ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటూ ఉండగా సోషల్ మీడియాలో ఒక టైంలో స్టార్ హీరోల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోని ఇలా చిన్న హీరో అనడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్ లో రామ్ చరణ్ కూడా రవితేజని గారు లేదా సర్ అని పిలవకుండా స్టేజ్ పైన జస్ట్ రవితేజ రవి అంటూ పిలవడం కూడా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఎంత క్లోజ్ అయినా స్టేజ్ పైన ఒకరి గురించి మాట్లాడే క్రమంలో గౌరవం ఇస్తే బాగుండేదని అంటున్నారు.. ఇలా ఇప్పుడు ఇద్దరు హీరోల లేటెస్ట్ సక్సెస్ మీట్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అయ్యాయి…