టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 రీమేక్ అయినా కానీ మెగాస్టార్ రీ ఎంట్రీ వలన బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమా తర్వాత సైరా కి ఎక్కువ టైం తీసుకుని చేసినా టాక్ బాగున్నా ఫలితం ఓవరాల్ గా రివర్స్ అయింది. ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న చిరు తర్వాత మూవీ ని సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో….
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అనేక రూమర్స్ ఈ సినిమా చుట్టూ తిరుగుతూ ఉండగా లేటెస్ట్ గా సినిమా పై ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది… ఆ వివరాల్లోకి వెళితే…
చిరు సినిమా కథని ఉన్నది ఉన్నట్లు కాకుండా మార్పులు చేర్పులు చేసి తీద్దాం అనుకుని సుజిత్ కి స్టొరీలో మార్పులు చేయమని చెప్పగా ఇన్నాళ్ళు అదే పనిలో ఉన్న సుజిత్ చాలా మార్పులు చేశారట. అందులో ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి చిరు కి హీరోయిన్ ని కామెడీ యాంగిల్ ని కూడా పెట్టారట.
కథ లో కూడా కొన్ని మార్పులు చేయగా అవన్నీ చిరు కి రీసెంట్ గా వినిపించారని టాక్. ఆ మార్పులు చేర్పులు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు విని చిరు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. ఓవరాల్ గా ఆ మార్పులు చేర్పులు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిరు కి నచ్చలేదని అంటున్నారు. అలా చేస్తే..ఒరిజినల్ ని చెదగట్టిన వాళ్ళం అవుతాం అంటూ…
ఈ ప్రాజెక్ట్ పై పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది… మరో టాక్ ఏంటి అంటే… కొత్త డైరెక్టర్ అయిన సుజిత్ ని అనవసరంగా రీమేక్ ని అప్పగించామని…. భావిస్తూ ఇప్పుడు సుజిత్ తన స్టైల్ లో రాసుకున్న కథ తోనే సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న భావన లో చిరు ఉన్నారట. దానికి సుజిత్ కూడా సరే అంటున్నారని సమాచారం… దాంతో సుజిత్ డైరెక్షన్ లో లుసిఫర్ రీమేక్ కాకుండా కొత్త కథతో సినిమా ఉండే అవకాశం ఉందని లేటెస్ట్ టాక్….