మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో చాలా సినిమాలు రికార్డులను క్రియేట్ చేశాయి, కానీ ఎక్కువ మందికు గుర్తు ఉండే సినిమాలలో ఇంద్ర సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. 2002 టైం లో రాయలసీమ నేపధ్యంలో ఫస్ట్ టైం చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా పై క్రేజ్ మరో లెవల్ లో ఉండేది, ఆ సినిమా ఆడియో ఎక్స్ లెంట్ హిట్ తర్వాత రిలీజ్ టైం కి థియేటర్స్ లో జనాలు…
రిలీజ్ అయిన రోజు నుండి 100 రోజుల పాటు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము దులిపెసిన ఆ సినిమా ఆ టైం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే సినిమా అందుకోని 30 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి 32 కోట్ల కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులను…
తిరగరాసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న ఇంద్ర సినిమా గురించి ఆ సినిమా డైరెక్టర్ బి గోపాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతో ఈ సినిమా రిలీజ్ టైంలో కలెక్షన్లు, థియేటర్ల దగ్గర ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని.. అప్పట్లో దాని గురించి…
వచ్చిన వార్తలన్నీ విని ఆశ్చర్యపోయానని చెప్పారు గోపాల్. మామూలుగా బ్లాక్లో టికెట్లు మహా అయితే 500 పెట్టి కొనేవారని.. కానీ మదనపల్లిలో ఒక వ్యక్తి పది వేల రూపాయల కట్ట ఇచ్చి 5 టికెట్లు తీసుకున్నారని తెలిసి షాకయ్యానని గోపాల్ తెలిపారు. ఆ టైంలో ఒక లేడీ ఐపీఎస్ అధికారి తమకు ఒక డిన్నర్ ఇచ్చారని.. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మామూలుగా కొత్త సినిమాలు….
రిలీజైతే ఎస్సై స్థాయి అధికారులు వెళ్లి జనాలను కంట్రోల్ చేస్తారని, కానీ ‘ఇంద్ర’ సినిమాకు మాత్రం ఎస్పీ స్థాయిలో ఉన్న తాను వెళ్లి జనాలను కంట్రోల్ చేయాల్సి వచ్చిందని చెప్పారని గోపాల్ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి చాలా మందికి తెలియని ఎన్నో అద్బుతాలను ఆ టైం లోనే సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇంద్ర సినిమా.