బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా భారీగా నిరాశ పరిచిన తర్వాత మెగాస్టార్ న్యూ మూవీస్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడుతుంది అని ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా బిజినెస్ నిరూపించింది.. సినిమా కొన్ని చోట్లా బయర్స్ లేక పోవడంతో ఓన్ గానే రిలీజ్ అవుతూ ఉండగా ఆ వాల్యూ బిజినెస్ తీస్తే చాలా తక్కువ బిజినెస్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది వన్ ఆఫ్ లోవేస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 సినిమా ఓవరాల్ గా 89 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను….
సొంతం చేసుకోగా తర్వాత మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ తో చేసిన పాన్ ఇండియా మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమా అన్ని వర్షన్ లు కలిపి ఏకంగా 187.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది… ఆ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న తర్వాత…
మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి చేసిన లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా మొత్తం మీద 131.2 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా అత్యంత భారీ నష్టాలతో బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఇంపాక్ట్ మెగాస్టార్ లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా పై పడగా….
ఇప్పుడు ఈ సినిమా మొత్తం మీద 91 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇందులో కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ ను పక్కకు పెడితే 80 కోట్ల లోపే బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…