Home న్యూస్ మెగాస్టార్ చేస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ రైట్స్ ఎంతో తెలుసా??

మెగాస్టార్ చేస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ రైట్స్ ఎంతో తెలుసా??

782
0

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా ను వేరే భాష లో రీమేక్ చేయడం అన్నది సర్వ సాధారమైన విషయమే… కానీ అదే సినిమా ఆల్ రెడీ డబ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కూడా రీమేక్ చేయడం అన్నది మాత్రం చాలా కొత్త విషయం అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఇది వరకు పవన్ కళ్యాణ్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన వీరం సినిమా తెలుగు లో…

Tollywood Actors Top Anniversary Trends

వీరుడొక్కడే పేరుతో డబ్ అయినా మళ్ళీ 1.2 కోట్ల రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకుని కాటమరాయుడు పేరు తో రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించ బోతున్న అప్ కమింగ్ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే సినిమా తెలుగు లో ముందు డబ్ అయ్యి రిలీజ్ కూడా అయ్యింది, అయినా కానీ పెద్దగా ఆడక పోవడం తో మెగాస్టార్ కి బాగా సూట్ అవుతుందని రీమేక్ చేయాలనీ ఫిక్స్ అవ్వగా రీమేక్ రైట్స్ ని కొనుకున్నారట.. ఈ సినిమా కి రీమేక్ రైట్స్ కింద…

సుమారు 1.7 కోట్ల రేటు చెల్లించారని సమాచారం, దాంతో ఆల్ రెడీ డబ్ అయ్యి మళ్ళీ రీమేక్ అయిన సినిమాలలో ఎక్కువ రేటు పలికిన సినిమా గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ రీమేక్ ని కూడా రామ్ చరణ్ నిర్మించ బోతుండగా డైరెక్షన్ పనులను సాహో ఫేం సుజీత్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కథ లో కొన్ని మార్పులు చేర్పులు…

అలాగే మరిన్ని ఎలివేషన్ సీన్స్ ని రాసుకునే పనిలో ఉన్నాడట సుజీత్, అలాగే చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా తో బిజీ గా ఉండగా ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్ల బోతున్నాడని సమాచారం. మరి ఈ సినిమా రిజల్ట్ కాటమరాయుడు లా అవుతుందా లేదా తెలుగులో కుమ్ముతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here