టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి. టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ లో ఒకటి ఈ సినిమా. ఈ సినిమా కోసం ఏకంగా 270 కోట్ల రేంజ్ బడ్జెట్ ని పెట్టేశాడు నిర్మాత రామ్ చరణ్. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో రామ్ చరణ్ సేఫ్ అయినా థియేట్రికల్ బిజినెస్ 187.25 కోట్ల మార్క్ వేట లో సినిమా అంచనాలను అందుకోలేదు.
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వచ్చినా ఫ్లాఫ్ గా పరుగును పూర్తీ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల వేడుకని పూర్తీ చేసుకుంది. ఈ ఇయర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ 50 డేస్ సెంటర్స్ లో నడిచిన సినిమా లో ఒకటిగా నిలిచింది సైరా సినిమా.
సైరా నరసింహా రెడ్డి సినిమా ఫైనల్ రన్ ని పూర్తీ చేసుకుని చాలా రోజులే అవుతున్నా కొన్ని సెంటర్స్ లో థియేటర్స్ రెంట్స్ మెయిన్ టైన్ చేసే విధంగా కలెక్షన్స్ రావడంతో ఆ సెంటర్స్ లో సినిమాను 50 రోజులు పూర్తీ చేసుకుంది, కానీ ఆ సెంటర్స్ నుండి షేర్స్ అయితే రాలేదు.
ఓవరాల్ గా సినిమా 32 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుకని పూర్తీ చేసుకోగా మరో 2 షిఫ్ట్ సెంటర్స్ లో కూడా 50 రోజులను పూర్తీ చేసుకుంది. ఓవరాల్ గా 50 రోజుల డైరెక్ట్ సెంటర్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam 2
?Ceeded 13
?UA 9
?West 4
?East 2
?Guntur 1
?Krishna 1
Total – 32 centers ఇవీ మొత్తం మీద 50 రోజుల వేడుకని జరుపుకున్న సెంటర్స్.
మొత్తం మీద సినిమా పాజిటివ్ టాక్ తో ఫ్లాఫ్ అయినా మెగాస్టార్ స్టామినా తో 50 రోజుల వేడుకని డీసెంట్ సెంటర్స్ లో జరుపుకుంది, కొంచం రిలీజ్ డేట్ విషయం లో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటె అలాగే ప్రమోషన్ పెర్ఫెక్ట్ గా చేసి ఉంటె సినిమా లెక్క మరో రేంజ్ లో ఉండి ఉండేది.